తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోష్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా వీరిద్దరూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణుకి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’ మూవీ తర్వాత ఆ స్థాయి హిట్స్ రాలేవనే చెప్పాలి. చాలా గ్యాప్ తీసుకొని సూర్య దర్శకత్వంలో ‘జిన్నా’ మూవీ చేశాడు. హారర్ కామెడీ జానర్ లో చేసిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే కలెక్షన్ల పరంగా నిరాశపరిచినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
జిన్నా చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పూత్, బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించారు. మంచు విష్ణునే తన సొంత బ్యానర్ లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక జిన్నా మూవీ ప్రమోషన్ కోసం మంచు విష్ణు అండ్ టీమ్ తెగ కష్టపడ్డారు. కానీ, అదే సమయానికి మరో నాలుగు మూవీలు రిలీజ్ కావడంతో కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో జిన్నా చిత్రం మాత్రం మంచు ఫ్యామిలీకి ఒక రకంగా మంచి లాభాలు తెచ్చినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ లో మంచు విష్ణు నటించిన చిత్రాలు డబ్బింగ్ అయి మంచి వ్యూస్ రాబట్టాయని అంటారు. అంతేగాక బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అందాల భామలు సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ లు జిన్నా మూవీలో అందాల విందు చేశారు. ఇదిలా ఉండగా.. జిన్నా మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ పది కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. కానీ.. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. హిందీలో డబ్బింగ్ రైట్స్ పదికోట్లకు అమ్ముడుపోతే నిర్మాతగా మంచు విష్ణుకి మంచి లాభాలు వచ్చినట్టే అని అంటున్నారు. అదీగాక డిజిటల్ రైట్స్, థియేట్రికల్ కలెక్షన్లు అన్నీ కలుపుకుంటే పెట్టిన పెట్టుబడికి ఎక్కువ లాభాలు వచ్చి ఉంటాయని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.