గతంలో వచ్చిన సినిమాలకంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలు వస్తున్నప్పటికీ.. హిట్స్ సంఖ్యలో మాత్రం వెనకబడే ఉంటోంది ఇండస్ట్రీ. లాక్ డౌన్ కి ముందు ఓ మీడియం సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఫిబ్రవరి ఎలాగో బిజినెస్ సీజన్ కాదు. కాబట్టి.. చిన్న సినిమాలకు ఇదే మంచి ఛాయస్ అని చెప్పాలి. కేవలం శుక్రవారం.. తెలుగు నుండే ఏడు సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి.
ప్రతి ఏడాది తెరపైకి వస్తున్నా సంఖ్య పెరుగుతూ పోతోంది. గతంలో వచ్చిన సినిమాలకంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలు వస్తున్నప్పటికీ.. హిట్స్ సంఖ్యలో మాత్రం వెనకబడే ఉంటోంది ఇండస్ట్రీ. లాక్ డౌన్ కి ముందు ఓ మీడియం సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఎప్పుడైతే లాక్ డౌన్ ముగిసిందో.. ఒక్కసారిగా రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలతో పాటు.. ఆల్రెడీ వాయిదా పడి వెయిటింగ్ లో ఉన్న సినిమాలు.. ఇలా అన్నీ రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ వద్ద పోటీ పెరిగిపోయింది. ఇది కేవలం తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లోను ఇదే పరిస్థితి. అందుకు కారణాలు ఏవైనా.. ఈ వారం మాత్రం ఊహించని సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
జనవరిలో పెద్ద సినిమాలు ఉండటంతో చిన్న సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఫిబ్రవరి ఎలాగో బిజినెస్ సీజన్ కాదు. కాబట్టి.. చిన్న సినిమాలకు ఇదే మంచి ఛాయస్ అని చెప్పాలి. అందుకే ఇప్పుడు ఫిబ్రవరి నాలుగో శుక్రవారం.. కేవలం తెలుగు నుండే ఏడు సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి. అలాగే తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, ఇంగ్లీష్ కూడా చూస్తే.. ప్రేక్షకుల ముందుకు సుమారు 20 సినిమాలు వస్తున్నాయి. మరి చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల పోరు గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. కానీ.. వీటిలో జనాలకు బాగా తెలిసినవి.. ప్రమోషన్స్ ద్వారా జనాలను రీచ్ అయినవి పెద్దగా కనిపించట్లేదు. మరి ఈ శుక్రవారం(ఫిబ్రవరి 24న) రిలీజ్ అవుతున్న థియేట్రికల్ సినిమాలేంటో చూద్దాం!