చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రమోషన్స్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆయా హీరోల అభిమానులలో ఉత్సాహం పీక్స్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన సినిమా వస్తుందంటే ఎవరి ఫ్యాన్స్ లోనైనా అదే ఊపు ఉంటుంది. అదే ఊపు ఫ్యాన్స్, ఫాన్స్ మధ్య వార్ క్రియేట్ చేస్తే ఆ పరిణామాలు ఎప్పుడైనా విచారమే మిగిలిస్తాయి. ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పుడూ హెల్తీ వాతావరణంలో జరగాలి. కానీ.. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అనే ఆవేశంలో లేనిపోని గొడవలు జరిగి.. ఆఖరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి.
పదేళ్ల క్రితం ఫ్యాన్ వార్ లో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ కారణంగా స్టార్ హీరో సినిమా ప్రమోషన్స్ లోనే పాల్గొనట్లేదు అనంటే మీరు నమ్ముతారా? కానీ.. సుమారు పదేళ్లుగా అదే జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తన ప్రతి సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతూ వస్తోంది. ఇక్కడి తెలుగు ప్రేక్షకులు కూడా అజిత్ సినిమాలను అంతే ఓన్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే.. ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో అజిత్ ఫ్యాన్స్ కి, విజయ్ ఫ్యాన్స్ కి మధ్య వివాదం ముదిరి.. అందులో విజయ్ ఫ్యాన్ ఒకరు చనిపోయారట.
ఆ ఘటన అజిత్ ని ఎంతో కలచివేసిందట. అప్పటినుండి అజిత్ తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం మానేశాడని సమాచారం. ఇదిలా ఉండగా.. అజిత్ నటించిన తాజా చిత్రం ‘తెగింపు’ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అజిత్ సినిమాకి పోటీగా విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలు ఒకే రోజున.. అంటే జనవరి 11న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు మేకర్స్. ఓవైపు తెగింపు టీమ్ ప్రమోట్ చేస్తుండగా.. మరోవైపు స్వయంగా విజయ్ వారసుడు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే.. సినిమాలు బాగుంటే ప్రేక్షకులే ఆదరిస్తారని అజిత్ బలంగా నమ్ముతాడట.
ఇక అజిత్, విజయ్ ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఇది కొత్త కాదు. గతంలో కూడా వీరి సినిమాలు ఒకేసారి విడుదలై మంచి విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఎంత మంచి సినిమా అయినా హీరో విజయ్ ప్రమోట్ చేసినట్లుగా.. అజిత్ చేయడు. అందుకు ఒకే ఒక్క కారణం.. ఫ్యాన్ వార్స్. ప్రమోషన్స్ లో పాల్గొని అనవసరంగా ఫ్యాన్స్ మధ్య గొడవలు రేకెత్తించడం ఎందుకని అజిత్ పదేళ్లుగా మానేశాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అజిత్ రీజన్ ఇదేనా లేక వేరే ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక తెగింపు సినిమాని డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించగా.. బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమాలో అజిత్ సరసన మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. మరి ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన తెగింపు సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Thunivu releasing worldwide in theatres – January 11th. #Ajithkumar #HVinoth @BoneyKapoor @ZeeStudios_ @BayViewProjOffl @RedGiantMovies_ @kalaignartv_off@NetflixIndia @SureshChandraa #RomeoPictures @mynameisraahul pic.twitter.com/3QqdyvrMlI
— Zee Studios South (@zeestudiossouth) January 4, 2023