95వ ఆస్కార్ అవార్డులలో ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం చరిత్ర సృష్టించింది. ఇండియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ తో పాటు 'ది ఎలిఫెంట్ విస్ఫర్స్' ఆస్కార్ ఫైనల్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 'ది ఎలిఫెంట్ విస్ఫర్స్' చరిత్ర సృష్టిస్తూ మొదటి ఆస్కార్ ని ఇండియాకి అందించింది.
95వ ఆస్కార్ అవార్డులలో ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం చరిత్ర సృష్టించింది. ఇండియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ తో పాటు ‘ది ఎలిఫెంట్ విస్ఫర్స్’ ఆస్కార్ ఫైనల్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ చరిత్ర సృష్టిస్తూ మొదటి ఆస్కార్ ని ఇండియాకి అందించింది. కార్తీకి గొన్సాల్వ్స్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింని గునీత్ మోంగా, డాగ్లస్ బ్లుష్, అచిన్ జైన్ నిర్మించారు. ఆస్కార్స్ లో బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో మొత్తం ఐదు పోటీలో నిలవగా.. అందులో ఇండియన్ షార్ట్ ఫిలిం విజేతగా నిలిచింది.
ఇక ఆస్కార్స్ లో ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’తో పాటు హలౌట్, ది మార్తా మిట్చెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్, హౌ డు యూ మెజర్ ఏ ఇయర్.. షార్ట్ ఫిలిమ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్స్ లో నామినేట్ అయ్యాయి. సో.. ఆఖరికి ఇండియన్ షార్ట్ ఫిలింని అవార్డు వరించడంతో భారత సినీ ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ షార్ట్ ఫిలిం స్టోరీ.. ఒక అనాధ జంటకి, రఘు అనే ఏనుగుకి మధ్య జరిగే కథ ఇది. ఈ షార్ట్ ఫిలింని తమిళనాడుకు చెందిన లేడీ ఫిలిం మేకర్ కార్తీకి గొన్సాల్వ్స్ రూపొందించారు. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇండియాకి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు ఆస్కార్ గెలుపొందిన ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా.. 2018లో ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. 2019 బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ ఆస్కార్ గెలుపొందింది. ఈ లెక్కన నిర్మాత గునీత్ మోంగాని ఆస్కార్ వరించడం ఇది రెండోసారి. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇప్పుడదే బాటలో గునీత్ చేరిపోయారు.
‘The Elephant Whisperers’ wins the Oscar for Best Documentary Short Film. Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/WeiVWd3yM6
— The Academy (@TheAcademy) March 13, 2023