ఇండస్ట్రీలో మొదటిసారి కలిసి పనిచేసిన హీరో, దర్శకులు.. సినిమా సక్సెస్ అయితే కలిసి రెండో సినిమా చేయడం రెగ్యులర్ గా కాకపోయినా.. అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
సినీ ఇండస్ట్రీలో మొదటిసారి కలిసి పనిచేసిన హీరో, దర్శకులు.. సినిమా సక్సెస్ అయితే కలిసి రెండో సినిమా చేయడం రెగ్యులర్ గా కాకపోయినా.. అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అయిపోతాయి. ప్రేక్షకులు, ఫ్యాన్స్ లోనూ వీరి కాంబినేషన్ పై మినిమమ్ అంచనాలు ఏర్పడతాయి. అయితే.. ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులలో అంచనాలు కుదరాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మూవీ హిట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి కలయికలోనే దర్శకుడు సూపర్ హిట్ ఇచ్చాడంటే.. ఖచ్చితంగా ఆ దర్శకుడి కాంబినేషన్ లో రెండో సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
అదేంటంటే.. విజయ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ తెలుగు దర్శకనిర్మాతలతో కలిసి ‘వారిసు'(వారసుడు) సినిమా చేశాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో విజయ్, రష్మిక మందాన హీరోహీరోయిన్స్ గా నటించిన వారసుడు మూవీ.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. ముందు నుండే సాంగ్స్ తో అంచనాలు పెంచిన వారసుడు మూవీ.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్లు వసూల్ చేసి మంచి విజయాన్ని అందుకుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వంశీ ఈ సినిమా తెరకెక్కించాడు. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో విజయ్ కి తన ముందు సినిమాలనుండి పరిచయం ఉంది.
ఈ క్రమంలో తాజాగా వారసుడు కాంబినేషన్ లో రెండో మూవీ రాబోతుందని టాక్ నడుస్తోంది. ఆల్రెడీ రెండో మూవీకి సంబంధించి విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లిల మధ్య చర్చలు కూడా జరిగాయని.. విజయ్ కూడా వంశీ చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. వంశీ కూడా నెక్స్ట్ మూవీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే ఆలోచనలో సినీ వర్గాల ఉన్నాడని సమాచారం. అయితే.. ఈ సినిమా విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘లియో’ మూవీ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉందని వినికిడి. మరి ఇందులో నిజం ఎంత అనేది మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే రెండోసారి కాంబినేషన్ సెట్ అయితే.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఎందుకంటే.. తమిళ ప్రేక్షకులకు వంశీ టేకింగ్ బాగా నచ్చింది. సో.. ఇప్పుడు విజయ్ కూడా వంశీ, దిల్ రాజు కాంబోలో రెండో మూవీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.