సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అభిమాన సంఘాలు ఉంటాయన్న సంగతి మనందరికి తెలిసిందే. ఇక ఏ సందర్భంలోనైనా తమ అభిమానులకు ఏదైన సమస్య వస్తే వెంటనే స్పందిస్తుంటారు హీరోలు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో సరదాగా ఫ్యాన్ మీట్ లాంటివి ఏర్పాటు చేసి వారికి మరింతగా దగ్గరవుతుంటారు. తాజాగా తమిళ హీరో దళపతి విజయ్ కూడా చెన్నై లోని పనయూర్ ఆఫీస్ లో తన అభిమాన సంఘం అయిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ తో ఫ్యాన్ మీట్ ను ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ మీట్ లో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి, తన భవిష్యత్ సినిమాల గురించి చర్చించినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమంలో ఓ భావోద్వేగపూరితమైన దృశ్యం చోటు చేసుకుంది. నడవలేని దివ్యాంగుడిని ఎత్తుకున్నాడు దళపతి విజయ్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
దళపతి విజయ్.. ఇటు సినిమాలతో పాటుగా సమాజంలో జరిగే విషయాలపై కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటాడు. దాంతో ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ ఓ ఫ్యాన్ మీట్ ను ఏర్పాటు చేశాడు. ఫ్యాన్ మీట్ ను ప్రతీ నవంబర్ లో ఏర్పాటు చేస్తుంటాడు. అందులో భాగంగానే తాజాగా చెన్నైలోని పనయూర్ ఆఫీస్ లో అభిమానులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో తన రాజకీయ ప్రవేశం గురించి, తన రాబోయే సినిమాల గురించి అభిమానులతో చర్చించినట్లు తెలుస్తోంది. అదీకాకా సంక్రాంతికి తన సినిమా ‘వారసుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ ఫ్యాన్ మీట్ లో ఓ నడవలేని దివ్యాంగుడిని ఎత్తుకుని అభిమానులపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ అభిమానిని ఎత్తుకున్న పిక్ వైరల్ గా మారింది.
Thalapathy #Vijay met Vijay Makkal Iyakkam members at his Panaiyur office in Chennai today.. pic.twitter.com/PrsHnzjHXr
— Janardhan Koushik (@koushiktweets) December 13, 2022
தனது ரசிகருடன் நடிகர் விஜய்!#Vijay | #Varisu | #VarisuPongal pic.twitter.com/W8YU3HnP9D
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) December 13, 2022