ఈ మద్య స్టార్ హీరోల ఇంటికి బాంబు బెదిరింపులు కామన్ అయ్యాయి. ఇప్పటికే కోలీవుడ్ లో రజినీకాంత్, అజిత్ వంటి పెద్ద హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా పోలీసులు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అవి రాంగ్ కాల్స్ అని తేలిపోయాయి. తమిళ నటుడు దళపతి విజయ్ ఇంటికి మరోసారి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది.
గతంలో కూడా హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్టు చెన్నై నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నీలాంగరైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. నీలాంగరై పోలీసులు, బాంబు స్క్వాడ్ కలిసి తనిఖీ చేశారు. బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసు విషయమై పోలీసుల దర్యాప్తులో విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి చెందిన భువనేశ్వర్ అనే మనస్థిమితంలేని యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆ రాంగ్ కాల్ చేసింది ఓ మనస్థిమితంలేని యువకుడు అని తెలుసుకున్నారు పోలీసులు. అతడే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్లు నిర్ధారించుకున్నారు.
గతంలో కూడా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లల్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే బాంబు లేదని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.