ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మ్యారేజ్ అనే బంధంలోకి అడుగుపెడుతున్నారు. నచ్చిన వారితో ఏడడుగులు వేసేస్తున్నారు. మొన్నటికి మొన్న హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇక పలువురు నటీనటులు కూడా పెళ్లి అనే రిలేషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రముఖ దర్శకుడు కూడా చేరాడు. తాజాగా అతడి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ అట్లూరి, 2007లో జ్ఞాపకం సినిమాలో హీరోగా నటించాడు. 2010లో ‘స్నేహగీతం’ సినిమాలో యాక్ట్ చేయడంతో పాటు డైలాగ్స్ కూడా రాశాడు. ఆ తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత సినిమాల కోసం రైటింగ్ టీంలో పనిచేశాడు. ఇక వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మూవీతో పూర్తిస్థాయి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం ధనుష్ హీరోగా ‘సార్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. విద్యావ్యవస్థ బేస్ చేసుకుని తీస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కెరీర్ పరంగా పక్కనబెడితే.. జీవితంలో మాత్రం డైరెక్టర్ వెంకీ మరో అడుగువేశాడు. తాజాగా పూజా అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఆమె ఎవరు ఏంటనేది మాత్రం తెలియలేదు. ఈ ఈవెంట్ కు ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాల నిర్మాత స్వప్నదత్ తోపాటు పలు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.