నందమూరి తారకరత్న కన్నుమూసిన వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణం అటు నందమూరి ఫ్యామిలీతో పాటు.. ఇటు నందమూరి అభిమానులను సైతం విషాదంలో ముంచేసింది. ముఖ్యంగా తారకరత్న భార్యాబిడ్డలు ఆయన ఇక లేడనే విషయాన్నీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా అలేఖ్య రెడ్డి భర్త తారకరత్నతో కలిసి దిగిన చివరి ఫోటోను షేర్ మరోసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసిన వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణం అటు నందమూరి ఫ్యామిలీతో పాటు.. ఇటు నందమూరి అభిమానులను సైతం విషాదంలో ముంచేసింది. ముఖ్యంగా తారకరత్న భార్యాబిడ్డలు ఆయన ఇక లేడనే విషయాన్నీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. మూడు రోజులలో పుట్టినరోజు అనగా.. తారకరత్న 23 రోజులపాటు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. దీంతో బర్త్ డేకి ముందే కన్నుమూయడం అనేది తారకరత్న ఫ్యాన్స్, ఫ్యామిలీని బాగా కలచివేసింది. ఇటీవలే తారకరత్న చిన్న కర్మ నిర్వహించారు కుటుంబ సభ్యులు.
చిన్న కర్మ రోజే తారకరత్న పుట్టినరోజు కావడంతో.. అదే రోజు ఆయన భార్య అలేఖ్య రెడ్డి, కూతురు నిష్క సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూశాక అందరిలోనూ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పోస్ట్ బట్టే.. అలేఖ్య రెడ్డి తన భర్తను ఎంతలా ప్రేమించిందో.. ఇప్పుడు ఎంతలా మిస్ అవుతుందో అర్థమవుతుంది అంటూ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి తరుణంలో తాజాగా అలేఖ్య రెడ్డి భర్త తారకరత్నతో కలిసి దిగిన చివరి ఫోటోను షేర్ మరోసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యింది. తారకరత్న, పిల్లలతో పాటు కలిసి దైవదర్శనం అనంతరం దిగిన ఫోటో పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.
ఇక పోస్ట్ చేసిన ఫోటో గురించి చెబుతూ.. “ఇదే మేం ఆయనతో దిగిన చివరి ఫోటో. ఇదే ఆయనతో మా చివరి ట్రిప్. ఇవన్నీ నిజమని నమ్మాలంటే నా గుండె బద్దలవుతోంది. ఇదంతా నిజం కాదు.. కల కావాలని కోరుకుంటున్నా. నన్ను రోజు అమ్మ బంగారు అంటూ పిలిచే నీ గొంతు వినాలని ఉంది.” అని బాగా ఎమోషనల్ అయ్యింది అలేఖ్య రెడ్డి. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా, అలేఖ్య రెడ్డి పోస్ట్ చూసి.. ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటినుండి ధైర్యంగా ఉండాలంటూ మోటివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉండగా.. తారకరత్న పెద్దకర్మను మార్చి 2న ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించనున్నట్లు సమాచారం.