మనం సంతోషంలో ఉన్నప్పుడు.. అందరూ మన చుట్టూనే ఉంటారు. కానీ కష్టాలు, బాధలు వస్తేనే తెలుస్తుంది మనకు నిజమైన బంధువులు ఎవరో. కష్టాల్లో మనకు అండగా నిలిచిన వారిని ఎన్నటికి మరవకూడదు. ఈ విషయం తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి బాగా తెలుసు. ఇక కష్టాల్లో తమకు అండగా ఉన్న బాలయ్య గొప్ప మనసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రసుత్తం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
నందమూరి తారక రత్న మృతి చెంది 20 రోజులకు పైగానే అవుతోంది. ఆ విషాదం నుంచి నందమూరి కుటుంబం ఇంకా కోలుకోలేదు. మరీ ముఖ్యంగా తారకరత్న భార్య, బిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. కేవలం 39 ఏళ్ల చిన్న వయసులో తారకరత్న మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తారకరత్న బిడ్డలు చాలా చిన్న వాళ్లు. భవిష్యత్తులోనే వాళ్లకి తండ్రి ప్రేమ, రక్షణ ఎక్కువ అవసరం. కానీ విధి మాత్రం ఆ చిన్నారులపై ఏ మాత్రం జాలి, దయచూపకుండా తారకరత్నను దూరం చేసి.. ఆ కుటుంబానికి తీరని దుఖాన్ని మిగిల్చింది. అయితే ఇంతటి విషాదంలోనూ కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. బాలకృష్ణ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. పెద్ద దిక్కుగా మారి వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఇక తారకరత్న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి బాలయ్యే.. కంటికి రెప్పలా వారిని చూసుకున్నాడు. బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చాడు. ముందు నుంచి తారకరత్న-బాలయ్యల మధ్య మంచి బాడింగ్ ఉంది.
ఈ క్రమంలో తాజాగా అలేఖ్యారెడ్డి బాలకృష్ణ తమ కుటుంబానికి చేసిన సాయం, ఆపదవేళ ఆయన నుంచి లభించిన మద్దతును తలుచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు.. ‘‘మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి.. మంచి, చేడు ఏదైనా కానీ.. అవి పూర్తిగా సమసిపోయే వరకు రాయిలా మాకు అడ్డు నిలబడ్డ వ్యక్తి, ఆస్పత్రికి తీసుకువెళ్లే వేళ తండ్రిలా, నీ బెడ్ పక్కనే కూర్చొని నీ కోసం పాట పడినప్పుడు అమ్మలా, నిన్ను నవ్వించడం కోసం జోక్‌లు వేస్తూ.. సరదగా కనిపించి.. ఎవరు చూడనప్పుడు నీ కోసం కన్నీరు పెట్టుకున్న బాంధవుడు.. అన్ని వేళలా ఆయన మన వెంటే ఉన్నారు. నీవు మరి కొంత కాలం మాతో ఉండి ఉంటే బాగుండేది ఓబు(తారకరత్న).. మేం నిన్ను చాలా మిస్ అవుతున్నాం. ఒరిజనల్ ఫొటోలో ఓబును మార్ఫింగ్ చేసిన వాళ్లుకు ధన్యవాదాలు. వారు చేసిన ఎడిటింగ్ ఎంతో అందంగా ఉంది. వారికి ధన్యవాదాలు అంటూ’’ బాలయ్య తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసింది అలేఖ్యారెడ్డి. ఈ ఫొటోలో తారకరత్నను మార్ఫింగ్ చేసి యాడ్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజనులు.. నందమూరి కుటుంబంపై మరీ ముఖ్యంగా బాలకృష్ణ-తారకరత్న బాండింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధైర్యంగా ఉండండి మేడమ్.. బాలయ్య మీకు తోడుగా, నీడగా ఉన్నారు. మీకు ఏం కాదు. అంతా మంచే జరుగుతుంది.. సంతోషంలో ఎవ్వరైనా తోడుంటారు.. బాధలు, కష్టాల్లో మన వెంట ఉండే వారే నిజమైన బంధువులు.. అదే మా బాలయ్య.. ఆయన మనసు బంగారం అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ ముందు నుంచి అన్ని విషయాల్లోనూ తారకరత్న, ఆయన భార్య అలేఖ్య రెడ్డికి అండగా నిలుస్తూ వచ్చారు. కుటుంబం అంతా వారిని దూరం పెట్టినా… బాలకృష్ణ మాత్రం వారికి అండగా ఉండి.. వారికి మద్దతుగా నిలిచారు. తారకరత్నకు బాబాయ్ బాలయ్య అంటే ఎంతో ప్రేమ, అభిమానం. ఇక తారకరత్న మృతితో అలేఖ్య రెడ్డి చాలా కృంగిపోతున్నారు. ఆ విషయం ఈ పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. మరి అలేఖ్యారెడ్డి చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.