Nandi Award For Amaravathi Movie: తారకరత్న కోలుకొని తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రస్తుతం బాధలో ఉన్నారు. ఈ క్రమంలో తారకరత్నకి సంబంధించి తన లైఫ్ లో సాధించిన ఓ ముఖ్య విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెరీర్ లో పాజిటివ్స్ ని ఎలా స్వీకరించాడో.. విమర్శలను కూడా నవ్వుతూనే స్వీకరిస్తూ వచ్చాడు.
నందమూరి తారకరత్న.. 23 రోజులపాటు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ చివరికి కన్నుమూశాడు. జనవరి 27న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే టైంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంటనే బెటర్ ట్రీట్మెంట్ కోసం నారాయణ హాస్పిటల్ కి తరలించారు. కానీ.. హాస్పిటల్ లో చేరాక, ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి బెటర్మెంట్ లేక.. మెడికల్ సపోర్ట్ కి బ్రెయిన్, బాడీ సహకరించక పోవడంతో తారకరత్న హాస్పిటల్ బెడ్ పైనే తుదిశ్వాస విడిచాడు. తారకరత్న కోలుకొని తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రస్తుతం బాధలో ఉన్నారు.
ఈ క్రమంలో తారకరత్నకి సంబంధించి తన లైఫ్ లో సాధించిన ఓ ముఖ్య విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ళ వయసులో మరణించిన తారకరత్న.. తన 19వ ఏటనే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన తారకరత్న.. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వేంకటాద్రి, నందీశ్వరుడు, మహాభక్త సిరియాల, ఎదురులేని అలెగ్జాండర్, సారథి లాంటి సినిమాలు చేస్తూ వచ్చారు. కెరీర్ ప్రారంభం నుండి హిట్స్, ప్లాప్స్ పట్టించుకోకుండా తన బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేశాడు. సినిమాలు ఆడినా, ఆడకపోయినా ఎల్లప్పుడూ ఒక పాజిటివ్ స్పిరిట్ తో జీవించాడు తారకరత్న.
మీరు గమనిస్తే.. సాధారణంగా కొంతమంది హీరోలు తమపై నెగిటివ్ కామెంట్స్, విమర్శలు వస్తే యాక్సెప్ట్ చేసేందుకు వెనుకాముందు అవుతుంటారు. కానీ.. తారకరత్న అలా కాదు. కెరీర్ లో పాజిటివ్స్ ని ఎలా స్వీకరించాడో.. విమర్శలను కూడా నవ్వుతూనే స్వీకరిస్తూ వచ్చాడు. పలు ఇంటర్వ్యూలలో తానే స్వయంగా.. సినిమా నచ్చకపోతే ఎవరూ చూడరని ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. తారకరత్నని కెరీర్ లో చాలా విమర్శలు ఫేస్ చేశాడు. నటన రాదని, హీరోగా సూట్ అవ్వడని.. ఇలా ఎన్నో రకాలుగా విమర్శించిన వారందరికీ.. ఒక్కసారిగా ఒకే ఒక్క సినిమాతో సమాధానం చెప్పేశాడు. చెప్పడం కాదు.. సాలిడ్ గా తెరపైనే చూపించాడని చెప్పవచ్చు.
తారకరత్న.. హీరోగా సెట్ అవ్వడు, నటన రాదు.. అని కామెంట్స్ చేసిన వారందరూ 2009లో అమరావతి సినిమా రిలీజ్ అయ్యాక సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే.. ఆ సినిమాలో మొదటిసారి విలన్ గా నటించిన తారకరత్న.. శ్రీను అనే నెగిటివ్ క్యారెక్టర్ లో అద్భుతమైన నటన కనబరిచి.. ‘బెస్ట్ విలన్’గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ విధంగా నటన రాదన్న వాళ్లనే బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టి.. వాళ్ళ నోళ్లు మూయించిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. మంచి వ్యక్తిత్వం కలిగిన తారకరత్న.. ఏనాడూ ఎవరిపై నెగటివ్ కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు. అలాంటి తారకరత్న.. చిన్న వయసులోనే కన్నుమూయడంతో ఆయన్ని అభిమానించే అభిమానులు, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ బాధను వ్యక్తం చేశారు.