దివంగత నటుడు తారకరత్నతో నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం ఓ మాజీ సీఎం భార్య అని ఎంత మందికి తెలుసు? మరి వారు కలిసి నటించిన చిత్రం ఏంటో, ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజకీయాలకు.. సినిమాలకు అవినాభావ సంబంధం ఉందని మనకు తెలిసిందే. గత చరిత్రను చూస్తే.. సినిమాల్లో రాణించిన నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తమదైన ముద్ర వేసుకున్నారు. వారిలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితలు ముందు వరుసలో ఉన్నారు. అయితే రాజకీయ నేతలు సినిమా తారలను వివాహం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఈ క్రమంలోనే దివంగత నటుడు తారకరత్నతో నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం ఓ మాజీ సీఎం భార్య అని ఎంత మందికి తెలుసు? మరి వారు కలిసి నటించిన చిత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నందమూరి తారకరత్న.. గుండె పోటు కారణంగా ఇటీవలే మరణించిన విషయం మనందరికి తెలిసిందే. 23 రోజులు మరణంతో పోరాడి చివరికి ఓడిపోయి, మనల్ని వదిలి వెళ్లిపోయారు. దాంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. త్వరలోనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చెయ్యాలనుకున్నారు తారకరత్న. ఈ సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? తారకరత్నతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ హీరోయిన్ ప్రస్తుతం ఓ మాజీ సీఎం భార్య అని మీకు తెలుసా?
తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమా హీరోయిన్ గుర్తుందా మీకు? తనదైన నటనతో భద్రాద్రి రాముడు సినిమాలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ హీరోయిన్ పేరు రాధిక.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. గతంలో వీరిద్దరికి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. ఆ వార్తను నిజం చేస్తూ.. కుమారస్వామి, రాధికను వివాహం చేసుకున్నాడు. మెుదటి నుంచి రాధికకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇక నటిగానే కాకుండా ఈమె కన్నడలో కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అదీకాక భవిష్యత్ లో రాజకీయాల్లోకి కూడా రంగప్రవేశం చేసి సత్తా చాటాలని చూస్తోందట రాధికా.