హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా, తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కొండపై కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. కీర్తి ప్రస్తుతం తెలుగుతో పాటు పలు తమిళ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోలాశంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కనిపించనున్నారు. భోళా శంకర్ షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. ఇక, తమిళం విషయానికి వస్తే.. సైరన్, రఘుతాత, రివాల్వర్ రీతా సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు షూటింగులు జరుపుకుంటున్నాయి.
సినిమా షూటింగులతో బిజీగా ఉండే కీర్తి సురేష్.. పనికి కొంత బ్రేక్ ఇచ్చారు. తాజాగా, కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ తమిళ రిపోర్టర్ ఆమెను తమిళంలో మాట్లాడమని అడిగాడు. అందుకు కీర్తి సురేష్ ‘‘ నేను తిరుపతిలో ఉన్నాను’’ అని అన్నారు. తెలుగులోనే ఆమె ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దీన్ని కొంతమంది తమిళ నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
కీర్తి సురేష్ తమిళ భాషను అవమానపరిచే విధంగా మాట్లాడారని కోప్పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ.. ఆమెపై ట్రోలింగ్స్ చేయటం మొదలుపెట్టారు. అయితే, ఆమెకు సపోర్టుగా కూడా ఓ వర్గం పోస్టులు చేయటం మొదలుపెట్టింది. అర్థంపర్థం లేకుండా ట్రోలింగ్స్ చేయటం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతీ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడ్డం మానాలని హితవుపలుకుతున్నారు. మరి, కీర్తి సురేష్‌పై తమిళ నెటిజన్ల ట్రోలింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@KeerthyOfficial திருப்பதியில் தமிழில் பேசுவதில் என்ன பிரச்சனை? கோவில் எங்களால் கட்டப்பட்டது https://t.co/XF10KvFKBa
— Karnan_Gounder(Pala Vellalar) (@Paruppu_da) May 27, 2023