తమన్నా భాటియా. పరిచయం అవసరం లేని ముద్దుగుమ్మ. మిల్లీ బ్యూటీగా అభిమానులు పిల్చుకునే ఈ అమ్మడికి కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి. బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్‌కు ఆమె పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఆ రూల్స్ బ్రేక్ చేసేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినిమాల్లో సాధారణంగా లిప్ లాక్, బోల్డ్ సీన్స్ కన్పించవు. ఎందుకంటే ఆమె వాటికి దూరం. అలా రూల్స్ పెట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమాలో తనకంటూ పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా విషయంలో అందరూ చెప్పేది ఇదే. లిప్ లాక్స్ సీన్స్‌కు ఈమె దూరంగా ఉంటుందని. కానీ ఈ మధ్యన కొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో ముఖ్యంగా జీ కర్దా, లస్ట్ స్టోరీస్‌లలో ఆమె తన రూల్స్ బ్రేక్ చేసేసింది.
ఎందుకంటే వీటిలో ఆమె పూర్తిగా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌లో కన్పిస్తుంది. లిప్ లాక్స్ వంటి సీన్లకైతే కొదవేలేదు. బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ సీన్స్‌తో ఈ మధ్యన వైరల్ అవుతోంది మిల్కీ బ్యూటీ. లిప్ లాక్ దృశ్యాలు ఆమె సినిమాలో ఉండవని చాలామందికి తెలియదు కూదా. దీనిపైనే విమర్శలు వస్తున్నాయి. ఆఖరికి తమన్నా కూడా రూల్స్ బ్రేక్ చేసిందంటూ ట్రోలింగ్ మొదలైంది. కెరీర్ విషయానికొచ్చేసరికి రూల్స్ బ్రేక్ చేయక తప్పదనే ఇలా చేసిందంటున్నారు. అందుకే అవకాశాల కోసం అన్నింటినీ పక్కన పెట్టేస్తోందంటున్నారు. అందుకే బోల్డ్ సీన్స్‌తో అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తోంది. ఈ నేపధ్యంలో చాలా కాలం తరువాత తమన్నా నోరు విప్పింది. ఆ బోల్డ్ సీన్స్ వెనుక సీక్రెట్ చెప్పేసింది.
ఆ బోల్డ్ సీన్ల వెనుక అసలు కధ ఇదీ
వాస్తవానికి తమన్నా రూల్స్ బ్రేక్ చేయలేదట. ఆ బోల్డ్ సీన్స్ అన్నీ పూర్తిగా ఫేక్ అని కొరియోగ్రఫీ చేసినవని అంటోంది. షూటింగ్ సెట్‌లో ఓ ప్రత్యేక కోచ్ ఉంటారని చెప్పుుకొచ్చింది. ప్రతి కదలిక కొరియోగ్రఫీ చేసిన డ్యాన్స్ స్టెప్‌లా చేసిందని చెప్పింది. ఈ తరహా సీన్లు చాలా ప్రత్యేకంగా షూట్ చేస్తారంది. అదే సమయంలో సహచర కో స్టార్‌కు కొన్ని నిర్ధిష్ట భాగాలను టచ్ చేయకూడదనే సూచనలు ఇస్తారని వివరించింది. అంటే మొత్తానికి తమన్నా భాటియా బోల్డ్ సీన్స్ అన్నీ ఉత్తుత్తివేనన్నమాట. సో మిల్కీ బ్యూటీ రూల్స్ అలానే ఉన్నాయి.