‘ధోని’ బయోపిక్ ఎప్పుడు చూసినాసరే.. అందులో హీరోగా చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనల్ని మెస్మరైజ్ చేస్తాడు. అలాంటి అద్భుతమైన యాక్టర్ సడన్ గా రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడం.. దేశంలోని ప్రతి ఒక్కరినీ కదిలించింది. కన్నీరు పెట్టుకునేలా చేసింది. ఓ యంగ్ హీరో, అప్పుడప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న హీరో.. తనకు తానుగా ప్రాణాలు తీసేసుకోవడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అయితే అతడు చావు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ.. చాలామంది దాన్ని నమ్మలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు సుశాంత్ సింగ్ మరణం గురించి భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
ఇక విషయానికొస్తే.. టీవీ సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్, చిన్న చిన్న పాత్రలు చేస్తూ బాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ధోని’ సినిమాతో అటు సినిమా వాళ్లకే కాదు క్రికెట్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఒక్కసారిగా క్రేజ్ వచ్చిపడింది. ఈ క్రమంలోనే సుశాంత్ తో సినిమాలు చేసేందుకు పలువురు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు. అలా ఎన్నో హిట్ సినిమాలు చేసిన సుశాంత్.. చివరగా ‘చిచ్చోరే’ అనే కామెడీ ఎంటర్ టైన్ లో యాక్ట్ చేశాడు. ఇక 2020 లాక్ డౌన్ టైం అంటే జూన్ 14న ముంబయిలోని తన ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనే న్యూస్ సెన్సేషన్ గా మారింది. అతడిది ఆతహత్య అని కొందరు భావిస్తే.. మరికొందరు మాత్రం హత్య చేశారని బలంగా వాదించారు. ఈ ఘటన జరిగి రెండేళ్లకు పైనే అవుతున్నప్పటికీ ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. ఇలాంటి టైంలో సుశాంత్ మరణం గురించి సదరు ఆస్పత్రి సిబ్బంది షాకింగ్ విషయం బయటపెట్టాడు.
‘సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు.. పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ లో ఐదు మృతదేహాలు వచ్చాయి. వాటిలో సుశాంత్ ని గుర్తుపట్టాం. అతడి శరీరంపై చాలా గుర్తులున్నాయి. మెడపై కూడా రెండు మూడు గుర్తులు కనిపించాయి. పోస్ట్ మార్టం రికార్డ్ చేయాలి. కానీ ఫొటోలు మాత్రం తీయాలని ఉన్నతాధికారులు చెప్పారు. అందుకే వారు చెప్పినట్లే మేం చేశాం. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పాం. కానీ దాన్ని వారు దాచిపెట్టి, పని మాత్రమే చేయండి అని అన్నారు. దీని గురించి మా సీనియర్స్ కు తెలియజేశాం. వాళ్లు కూడా సేమ్ ఆన్సర్ చెప్పారు. మరోవైపు తొందరగా బాడీ ఫొటోస్ తీసి తమకు అప్పగించాలని పోలీసులు తొందరపెట్టారు. అందుకే రాత్రిపూట మాత్రమే పోస్ట్ మార్టం చేశాం’ అని రూప్ కుమార్ షా అనే ఆస్పత్రి సిబ్బంది చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. మరి సుశాంత్ ని హత్య చేశారనే వార్తలపై మీ అభిప్రాయం ఏంటి.. కింద కామెంట్ చేయండి.
Roopkumar Shah a Cooper hospital Mumbai mortuary room employee claims that Sushant Singh Rajput was Murdered. He was present their during the Postmortem he claims.
HM of Maharashtra should provide him security immediately & make him connect with CBI @Dev_Fadnavis. pic.twitter.com/2DdMt8v3zb
— Sameet Thakkar (@thakkar_sameet) December 26, 2022