హీరో సూర్య పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ మన స్టార్ హీరోలకు సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య ప్రతి సినిమా కూడ ఇక్కడ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఏడాది ‘విక్రమ్’లో రోలెక్స్ గా కనిపించి సర్ ప్రైజ్ చేసిన సూర్య.. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన ఓ సినిమా.. పూర్తిగా ఆగిపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ వస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా అంటే హీరో సూర్యతో పాటు డైరెక్టర్ బాలాకు కూడా చాలా ప్యాషన్. ఇద్దరూ కూడా ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికే 100 శాతం ప్రయత్నిస్తారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘నంద’, ‘శివపుత్రుడు’ లాంటి అద్భుతమైన సినిమాలొచ్చాయి. ఇక హ్యాట్రిక్ మూవీ కోసం సూర్య-బాలా కలిసి పనిచేస్తున్నారని గత కొన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. అలానే కొన్నాళ్లకు కన్యాకుమారిలో షూటింగ్ కూడా మొదలైంది. దీంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సడన్ గా ఇప్పుడు మూవీ నుంచి సూర్య తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ బాలానే బయటపెట్టాడు.
తొలి షెడ్యూల్ కన్యాకుమారిలో భారీ సెట్ వేసి షూట్ చేశారని, రెండో షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉండగా.. సూర్య, బాలా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని తెలుస్తోంది. దీని వల్ల పరస్పర అంగీకారంతోనే.. సూర్య ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. దీన్ని స్టార్ డైరెక్టర్ బాలానే ధ్రువీకరించారు. అయితే సూర్య వెళ్లిపోయినప్పటికీ సినిమా ఆగలేదని, ఆ ప్లేసులో మరో హీరో నటిస్తారని బాలా క్లారిటీ ఇచ్చారు. ఎంతో సఖ్యతతో ఉండే వీరిద్దరి మధ్య ఇలా గొడవలు జరిగి, సినిమాని ఆపేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. బడ్జెట్ పెరుగుతుండటం, షెడ్యూల్స్ వాయిదా పడుతుండటమే.. సూర్య బయటకొచ్చేయడానికి కారణాలు అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తోంది.
ఇకపోతే ఈ ప్రాజెక్టు తొలి షెడ్యూల్ పూర్తి కాగానే.. వనంగాన్ (తెలుగులో ‘అచలుడు’) అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సూర్య, జ్యోతిక ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. గత రెండేళ్లలో ఆకాశమే హద్దురా, జై భీమ్ లాంటి మూవీస్ తో హిట్ కొట్టిన సూర్య.. ‘విక్రమ్’ క్లైమాక్స్ లో రోలెక్స్ గా కనిపించి భయపెట్టారు. ఇక శివ, వెట్రిమారన్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తోనూ కలిసి పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా స్టార్ డైరెక్టర్ బాలా, గొడవల్లో ఇరుక్కోవడం కొత్తేం కాదు. గతంలోనూ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ విషయంలోనూ ఇలాంటి అనుభవాలు ఫేస్ చేశారు. ఇప్పుడు సూర్యతో సినిమా విషయంలోనూ సేమ్ ప్రాబ్లమ్ జరిగినట్లు కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.. స్టార్ డైరెక్టర్ బాలా తీస్తున్న సినిమా నుంచి సూర్య తప్పుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Official #Suriya out of #Vanangaan movie💔
Most likely the entire project is going to be dropped…even though the team is saying the movie works will be continued !! pic.twitter.com/yedxHuIOKi— AmuthaBharathi (@CinemaWithAB) December 4, 2022