సినీ సెలబ్రిటీలు ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభినయంతో పాటు అందాన్ని కాపాడుకుంటేనే పరిశ్రమలో చాన్నాళ్లు కొనసాగొచ్చు. ఇదిలాఉండగా.. టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత గురించి వినేఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కాస్త టాలెంట్ ఉన్న వారు కూడా సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిపోతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఎందరో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. డ్యాన్సుల ద్వారా ఫేమ్ కొందరు ఫేమస్ అవుతుందే.. పాటల ద్వారా మరికొందరు స్టార్లు అయిపోతున్నారు. అందంగా ఉండి డ్యాన్సులు చేయగలిగిన వాళ్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అందంగా లేకపోయినా వైవిధ్యమైన కంటెంట్ చేసేవారికీ ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. ఇదిలాఉంటే.. టాలీవుడ్ నటి సురేఖారాణి గురించి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా రాణిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె సంపాదించుకున్నారు.
సోషల్ మీడియాలోనూ సురేఖావాణి యాక్టివ్‌గా ఉంటారు. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. తాజాగా ఈ భామ ‘ధమాకా’ మూవీలోని ‘పల్సర్ బైక్’ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. అయితే ఈ పాటకు స్టెప్పులు వేసిన సమయంలో ఆమె టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపోయింది. దీంతో ఆమె పొట్ట కాస్త బయటకు వచ్చి కనిపిస్తోంది. దీనికి టమ్మీ టక్కర్ మర్చిపో అంటూ సుప్రీత క్యాప్షన్ జత చేసింది. ఆమె పొట్ట కనిపిస్తోందంటూ కామెంట్స్ వచ్చాయి. దీంతో ట్రోలింగ్ భయంతో రీల్‌కు కామెంట్ ఆప్షన్‌ను తీసేసింది సుప్రీత. ఒకవేళ కామెంట్ ఆప్షన్ ఆన్‌లో ఉంటే మాత్రం నెటిజన్స్ ఆమెపై మరింతగా కామెంట్స్ చేసేవారేమో. ఏదేమైనా సుప్రీత తెలివిని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.