టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విషయంలో గత రెండు రోజుల నుంచి ఓ చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది. విషయం ఏంటంటే..? సుకుమార్ శిశ్యుడు అయిన ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు గతంలోని ఓ సందర్భంలో పుష్ప సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
పుష్ప సినిమా 10 KGFలో సమానం అంటూ కితాబిచ్చారు. అయితే విడుదల తర్వాత ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని మిక్స్ డ్ టాక్ నడుస్తున్న సమయంలో బుచ్చిబాబు వ్యాఖ్యలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. అయితే రెండు రోజుల నుంచి బుచ్చిబాబు కామెంట్స్ పై మీమర్స్ సైతం విరుచుకుపడుతుండడం విశేషం.
కాగా తాజాగా సుకుమార్ సైతం బుచ్చిబాబు చేసిన కామెంట్స్ పై స్పందించారు. బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యల పట్ల నేను ఆయనతో మాట్లాడానని, దేని ప్రత్యేకత దానిదేనంటూ చెప్పుకొచ్చారు. ఇక పుష్ప సినిమాను KGF మూవీతో పోల్చడం సరికాదని కూడా అన్నారు. అయినా పుష్ప బ్యాక్ డ్రాప్ వేరు, కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ వేరంటూ డైరెక్టర్ సుకుమార్ సమాధానమిచ్చారు. అయితే బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుకుమార్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.