సాధారణంగా నటీనటులు కొన్ని పర్సనల్ విషయాల్ని పెద్దగా రివీల్ చేయరు. రిలేషన్ షిప్, విడాకులు లాంటి వాటి గురించి అయితే ఎవరైనా ఏదన్నా క్వశ్చన్ చేసినా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం యాక్టర్స్, కొన్నిసార్లు ధైర్యంగా బయటకు చెబుతున్నారు. తమ గురించి నిజాల్ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి షాకిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ నటుడు.. సంచలన నిజం బయటపెట్టాడు. దీంతో అతడి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. కొందరైతే ఇది నమ్మలేకపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత వెబ్ సిరీస్ లు చూడటం బాగా అలవాటైపోయింది. అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ లో మూడు సీజన్లు ఉన్న ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్.. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు ఆకట్టుకుంది. ఎలెవన్, మైక్ తో కలిసి పిల్లల గ్యాంగ్ అంతా చేసే అడ్వెంచర్స్.. ఈ సిరీస్ ని సూపర్ హిట్ చేశాయి. ఇక గతేడాది మూడో సీజన్ రిలీజైంది. అందులో విల్ బయర్స్ రోల్ లో యాక్ట్ చేసిన నోవా షన్నాప్.. స్వలింగ సంపర్కుడు పాత్రలో యాక్ట్ చేశాడు. తీరా ఇప్పుడు తాను నిజంగానే గే అని అందరికీ షాకిచ్చాడు. ’18 ఏళ్లపాటు భయపడుతూ బతికిన నేను ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నాను. నేను గే అని నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి చెప్పేశాను. కానీ వాళ్లెంతో ఈజీగా ఆ విషయం మాకు తెలుసు అని అనేశారు’ అని నోవా చెప్పిన ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది.
I’m so proud of Noah Schnapp for coming out!!! his caption almost made me choke laughing pic.twitter.com/36F55vCFcb
— Mirian 🐍 (@MirianMeriQuei) January 5, 2023