ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలకు కూడా అప్పుడప్పుడు పబ్లిక్ లో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిని సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోకపోయినా.. వారి ఫ్యాన్స్ మాత్రం అసలు ఊరుకోరు. ఏదొక విధంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు. తాజాగా పవర్ స్టార్ కి పబ్లిక్ లో చేదు అనుభవం ఎదురైంది.
సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలకు కూడా అప్పుడప్పుడు పబ్లిక్ లో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిని సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోకపోయినా.. వారి ఫ్యాన్స్ మాత్రం అసలు ఊరుకోరు. ఏదొక విధంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు. తాజాగా పవర్ స్టార్ కి పబ్లిక్ లో చేదు అనుభవం ఎదురైంది. లైవ్ లో పవన్ పై కొంతమంది రాళ్లు విసిరి దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోజ్ పురి ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ సింగ్.. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లా, నాగ్రా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.
ఈ క్రమంలో తన లైవ్ ప్రోగ్రామ్ ని ఆరంభించి.. పాడటం మొదలు పెట్టగానే.. జనాల్లో నుండి ఒకరు రాయి విసిరారు. అది కాస్త నేరుగా పవన్ ముఖానికి తగిలింది. దీంతో ఆ రాయి విసిరింది ఎవరు అనేలోపే జనాల్లో నుండి చాలామంది ఒక్కసారిగా పవన్ పై రాళ్లదాడి చేశారు. దీన్ని గమనించిన ఈవెంట్ మేనేజర్లు.. వెంటనే పవన్ ని స్టేజ్ పై నుండి కిందకి దింపేశారు. అయితే.. అసలు పవన్ పై రాళ్లదాడి ఎందుకు చేశారనే విషయాన్ని ఆరా తీయగా.. కొంతమంది తాగొచ్చిన యువకులు చేసిన పని ఇదని తెలిసింది. దీంతో ఈ ఘటనపై పవన్ సింగ్ చాలా సీరియస్ అయి.. గుంపులో నుండి విసరడం కాదు.. దమ్ముంటే నా ఎదురు నిలబడు అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడైతే పవన్ సింగ్ పరిస్థితి బాగానే ఉందట. ప్రెజెంట్ భోజ్ పురి ఇండస్ట్రీలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక తమ అభిమాన హీరోపై రాళ్లదాడి చేసిన వారిని వదలమని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇలా పబ్లిక్ ఈవెంట్స్ లో సెలబ్రిటీలపై దాడి చేయడమనేది ఎంతవరకు కరెక్ట్ కామెంట్స్ లో తెలియజేయండి.