ఎపుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి.. తాజాగా మెగా ఫ్యామిలీ.. ఈ మద్య జరిగిన మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తి అందరిని దృష్టిని ఆకర్షించింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యం తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో కొన్ని కారణాల వల్ల పక్కకు తప్పుకుంది. చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని సినీ, రాజకీయ నేతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తుంది.
‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయడం వెనుక మెగాబ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్ హస్తం ఉందని.. కొన్నేళ్లుగా తమ అధీనంలో ఉన్న ‘మా’ అసోసియేషన్ చేజారిపోయినందుకు నాగబాబు, పవన్ క్రియేట్ చేసిన డ్రామా అంటూ తనదైన స్టైల్లో కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ఇదే మా అసోసియేషన్ కార్యాలయం ముందు తాను బట్టలు విప్పి కూర్చుంటే.. ఒక్కరైనా తనకు సానుభూతి పలకలేదని.. ఆడవారు కూడా తనును గేలు చేశారని.. తాను కూర్చున్న చోటు యాసిడ్ తో కడగాలని కొందరు అంటే.. తన కాల్ లీస్ట్ తో బెనర్జీ పెద్ద రచ్చ చేశారని అన్నారు.
ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్‌లో అన్యాయం జరిగిందంటూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారంటూ వారిపై విరుచుకుపడింది. టులు హేమ, ప్రగతి, ఉత్తేజ్, బెనర్జీ, తనీశ్, శ్రీకాంత్‌ను తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ‘మా’కు సేవ చేస్తానని చెప్పిన వాళ్లు చిత్ర పరిశ్రమను రెండుగా ఎందుకు చీలుస్తున్నారని ప్రశ్నించింది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓటమిని అంగీకరించాలని హితవు పలికింది శ్రీరెడ్డి.