శ్రీరెడ్డి.. ఈ పేరు వినగానే అందరూ కాంట్రవర్సీల గురించే మాట్లాడతారు. ప్రస్తుతానికి శ్రీరెడ్డి ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయకుండా, వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన జీవితం గడిపేస్తోంది. ఒక టీవీ యాంకర్ కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, నటిగా రాని గుర్తింపు కాస్టింగ్ కౌచ్ వివాదాలతో బాగానే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు వాళ్లకు తెలుగు సినిమాల్లో అవకాశాలు కల్పించాలంటూ పెద్దఎత్తున నిరసన తెలిపింది. ప్రస్తుతం మాత్రం తమిళనాడులో సెటిల్ అయిపోయి.. అక్కడే యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంది.
శ్రీరెడ్డికి యూట్యూబ్, సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం కుకింగ్ వీడియోలు, డైలీ ఆక్టివిటీస్ వ్లాగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే ఒక్కసారిగా శ్రీరెడ్డి పెళ్లికూతురు అవతారం ఎత్తేసింది. పెళ్లి కూతురిలా ముస్తాబయ్యి ఓ వ్లాగ్ చేసింది. కాకపోతే పెళ్లి కోసం కాదని వీడియో ముందే చెప్పేసింది. ‘పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.. నేను ఎలాగు పెళ్లి చేసుకోను కనీసం బ్రెడల్ మేకప్ లో ఎలా ఉంటానో చూసుకుందాము, ఫ్యాన్స్ కు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా’ అంటూ అసలు విషయం చెప్పేసింది. ఇంక ఆమె ఏ విధంగా ముస్తాబయ్యింది, ఎలాంటి నగలు ధరించింది, ఎలాంటి మేకప్ వాడింది అంతా ఆ వీడియోలు చూపించింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. శ్రీరెడ్డి పెళ్లికూతురవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.