ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వరుస హిట్స్ లో ఉన్నా.. మార్కెట్ లో ఎక్కువగా వారి పేరు ట్రెండ్ అవుతున్నా.. అన్నింటికీ మించి యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరోయిన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ విషయంలో యంగ్ బ్యూటీ శ్రీలీల చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వరుస హిట్స్ లో ఉన్నా.. మార్కెట్ లో ఎక్కువగా వారి పేరు ట్రెండ్ అవుతున్నా.. అన్నింటికీ మించి యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరోయిన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ విషయంలో యంగ్ బ్యూటీ శ్రీలీల చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. పెళ్లిసందడి. ధమాకా సినిమాలతో ఫుల్ స్వింగ్ లో శ్రీలీల.. ప్రస్తుతం దొరికిన సినిమా అవకాశాలను దొరికినట్లుగా అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్ లను లైనప్ చేసిన ఈ భామ.. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ధమాకా సక్సెస్ తర్వాత శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె యాక్టింగ్, ఎనర్జిటిక్ డాన్స్ స్కిల్స్ చూసి.. యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. నార్త్ హీరోయిన్స్ లా కాకుండా తెలుగు వారికి నచ్చేవిధంగా శ్రీలీల హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎలాగో ట్రెండింగ్ లో ఉంది.. కాబట్టి, ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ నుండి మూడు సినిమాలు సైన్ చేసింది. సితార బ్యానర్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ తో పాటు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా, నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా ఓకే చేసింది. మరోవైపు బోయపాటి – రామ్ పోతినేని సినిమాలో కూడా ఓ సినిమా చేస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే.. రీసెంట్ గా నితిన్32లో, ఉస్తాద్ భగత్ సింగ్ లో అవకాశం అందుకుందని తెలుస్తోంది. అయితే.. పూర్ణ సైన్ చేసిన సినిమాల సంఖ్య అంతటితో అయిపోలేదు. మూడు సినిమాలు అవకాశం ఇచ్చిన సితార బ్యానర్ లోనే తాజాగా మరో సినిమా ఓకే చేసిందట. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సితార వారు ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ కి జోడిగా శ్రీలీల కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. దీంతో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ అమ్మడు.. ఇలా వరుస అవకాశాలతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. త్వరలోనే విజయ్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మరి ఫామ్ లో ఉన్న శ్రీలీల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.