తెలుగు చిత్ర సీమలో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది ధమాకా బ్యూటీ శ్రీలీల. తాజాగా తాను చేసిన ఓ పని కారణంగా.. అభిమానులకు క్షమాపణలు చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ధమాకా భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. తన ఎనర్జీ, డ్యాన్స్, అందంతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మోస్ట బిజీయోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పింది. అది ఏ విషయంలోనో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలీల.. అందం, అభినయం, డ్యాన్స్ అన్నింట్లోను అదరగొడుతూ.. టాలీవుడ్ లో దూసుకెళ్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. తాజా రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాలో తన డ్యాన్స్ తో ఇరగదీసింది లేత అందాల సోయగం శ్రీలీల. ఇక శ్రీలీల సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అన్న సంగతి మనకు తెలిసిందే. తాను ఏ ఊరు వెళితే అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే తాజాగా షూటింగ్ లో భాగంగా ఓ ఊరు వెళ్లింది ఈ అమ్మడు. అక్కడి రోడ్లు, గుడిలో, ఆవులతో దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ క్రమంలోనే ఫోటోలు క్వాలిటీ తక్కువగా ఉండటంతో అభిమానులకు సారీ చెప్పింది ఈ చిన్నది. దాంతో పాటుగా జీవితంలో చిన్నచిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాలో కూడా అవకాశం కొట్టేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.