లాక్డౌన్ సమయంలో చేపట్టిన సహాయ కార్యక్రమాలతో సోనూసూద్‌కు మంచి పేరొచ్చింది. అంతకుమందు సినిమా నటుడిగా గుర్తింపు ఉన్నాకరోనా కాలంలో పేదల కోసం ఆయన చేసిన మంచిపనులతో అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా ఇటీవల ఆయన కార్యాలయాలు, ఇతర స్థల్లాల్లో ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. దాడుల అనంతరం సోనూ.. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టలేదని తేల్చినట్లు అధికారులు చెప్పారు.
ఐటీ దాడులపై సోమవారం సోషల్ మీడియాలో సోనూసూద్ స్పందించారు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేషన్‌లో ప్రతి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్ చేశాను. ఈ నాలుగు రోజులు ఐటీ అధికారులతో బిజీగా ఉండడం వల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు నేను తిరిగి వచ్చా. నా ప్రయాణం కొనసాగుతుంది’ అని ఆయన ట్విట్లో పేర్కొన్నాడు.
