లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన తనయుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అభిమాన హీరో మరణవార్త విని దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం భావోద్వేగంతో సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో సెలబ్రిటీలు, అభిమానుల చివరిచూపు కోసం నిలిపారు. నవంబర్ 15న తెల్లవారుజామున.. కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కృష్ణ తుదిశ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీలో ఒకే ఏడాది ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోయేసరికి అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణ పార్థివదేహాన్ని టాలీవుడ్ ప్రముఖ హీరోలతో పాటు సీనియర్ నటులు, సీఎం కెసిఆర్, సీఎం జగన్ లతో పాటు పలువురు రాజకీయనేతలు పరామర్శించారు. తాజాగా తాతయ్య చివరి చూపుకోసం మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార పద్మాలయ స్టూడియోస్ కి చేరుకొని ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తాతయ్యను చూసి ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేక.. ఏడ్చేసింది. ప్రస్తుతం సితార, గౌతమ్ ఎమోషనల్ అవ్వడంతో అభిమానులు సైతం సోషల్ మీడియాలో కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.