ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ఇట్టే.. వరల్డ్ వైడ్ ఫార్వార్డ్ చేసేస్తోంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు, వీడియోలు సైతం సమాజంలో భారీ మార్పులను సూచిస్తాయి. ఇలాంటి తరుణంలో సార్ సినిమా కోసం ఓ స్కూల్ స్టూడెంట్స్ చేసిన డిమాండ్.. ఏకంగా ప్రొడ్యూసర్ స్పందించి ఫ్రీ షో వేయాలని స్పందించేలా చేసింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక దాని ఇంపాక్ట్ ఎలా ఉందో జనాలకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ఇట్టే.. వరల్డ్ వైడ్ ఫార్వార్డ్ చేసేస్తోంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు, వీడియోలు సైతం సమాజంలో భారీ మార్పులను సూచిస్తాయి. పనికిరాని వీడియోలు లేనిపోని ఇబ్బందులను, వివాదాలను తెచ్చిపెడతాయి. ఇలాంటి తరుణంలో ఓ సినిమా కోసం స్టూడెంట్స్ చేసిన డిమాండ్.. ఏకంగా ప్రొడ్యూసర్ స్పందించి ఫ్రీ షో వేయాలని స్పందించేలా చేసింది. అవును.. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్’. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.
ఇక శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషలలో విడుదలైన సార్ సినిమా.. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ వైడ్ పాజిటివ్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ.. రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. గతేడాది తిరు సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ధనుష్.. ఈ ఏడాది సార్ మూవీతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రెజెంట్ సార్ మూవీ.. థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. కాగా.. విద్యా వ్యవస్థపై, విద్యార్థుల హక్కులను ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ సినిమాకు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ విశేషంగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తమకు సార్ మూవీ ఫ్రీగా చుపించాలంటూ ఓ స్కూల్ స్టూడెంట్స్ చేసిన ధర్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ స్కూల్ స్టూడెంట్స్ తమ టీచర్స్ తో కలిసి సార్ మూవీని ఉచితంగా చూపించాలంటూ బ్యానర్ పట్టుకొని మరీ డిమాండ్ చేస్తూ రోడెక్కారు. పేరెంట్స్ వందల రూపాయలు పెట్టి.. సినిమా చూపించే స్థోమత లేకపోవడంతో ఆ పిల్లలు, టీచర్స్ ఇలా డిమాండ్ చేస్తూ కోరికను బయటపెట్టారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారి.. ఏకంగా నిర్మాత నాగవంశీ దృష్టికి చేరింది. ఇంకేముంది.. సినిమా తీసిందే విద్యార్థుల కోసం.. కాబట్టి, వారికి ఫ్రీ షో వేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, పిల్లల కోసం ఫ్రీ షో కావాలనే వారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు.
దీంతో ఆ ధర్నా చేసిన స్టూడెంట్స్ పాటు రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ యాజమాన్యం, పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సార్ మూవీ మూడో వారంలో సాగుతోంది. ఎలాగో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది. కాబట్టి.. ఇలా స్టూడెంట్స్ కోసం మేకర్స్ ఫ్రీ షోస్ ఓకే చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఫ్రీ షోస్ వలన కలెక్షన్స్ విషయం పక్కన పెడితే.. విద్యార్థులకు వారి హక్కులపై, విద్యా వ్యవస్థపై అవగాహన అయినా పెరుగుతుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విధంగా సినిమాకి రీచ్ కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో రైటర్ పద్మభూషణ్ సినిమాని కూడా ఇలాగే మహిళలకు ఫ్రీ స్క్రీనింగ్ చేశారు. సో.. మరి సార్ ఫ్రీ షోస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
The Major goal of #SIRMovie #Vaathi was to spread awareness about value of education. We are happy to show our movie free of cost to the School Kids.
Please send a mail at contact@sitharaents.com & our team will reach out to you at the earliest with the show confirmation!
— Naga Vamsi (@vamsi84) March 4, 2023