మన దేశంలో రాజులు పోయినా సరే.. రాచరిక వ్యవస్థకు సంబంధించి కొన్ని పద్దతులు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరైనా రాజకీయ నాయకుడు బయటకు వచ్చాడంటే చాలు ఆయన వెంట మందిమగాధుల పేరిట.. పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డు ఎక్కుతాయి. ఇక కొందరు రాజకీయ ప్రముఖులు వెళ్తుంటే.. వారి కోసం ట్రాఫిక్ ఆపేసి.. జనాలను రోడ్ల మీదే నిలిపి.. రోడ్డు బ్లాక్ చేసి వారు వెళ్లేవరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ నాయకుడి కోసం ఇలా రోడ్డు బ్లాక్ చేయడంతో.. తాను తీవ్రంగా ఇబ్బంది పడ్డానంటూ సింగర్ శ్రీరామ చంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమను ఇలా ఇబ్బంది పెట్టవద్దు అంటూ సీఎం కేసీఆర్‌కు రిక్వెస్ట్ చేశాడు. ఆ వివరాలు..
ఓ పొలిటిషియన్ కోసం ఫ్లైఓవర్‌ని బ్లాక్ చేయడంతో తాను ఫ్లైట్ మిస్సయ్యాను అంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు సింగర్ శ్రీరామచంద్ర. ఈ క్రమంలో.. ‘‘ఓ రాజకీయనాయకుడి కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ ఫ్లైఓవర్ కింద నుంచి పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రద్దీ పెరిగి.. నా ప్రయాణం అరగంట ఆలస్యం అయ్యింది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో నేను ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. వేరే ఫ్లైట్ పట్టుకోవడం గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు మరో 15 మంది కూడా ఈ కారణంగానే ఫ్లైట్ మిస్సయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే.. రాజకీయ నాయకుల కోసం మాలాంటి సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి’’ అంటూ వీడియో షేర్ చేశాడు శ్రీరామచంద్ర. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
సింగర్ శ్రీరామచంద్రకు ఈ విషయంలో నెటిజెన్స్ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. చాలా మంది నెటిజనులు.. తమకు కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అంటూ పోస్ట్ చేయసాగారు. కానీ ఈ విషయంలో మార్పు ఎక్స్‌పెక్ట్ చేయడం అత్యాశే అంటున్నారు నెటిజనులు. ఇక సింగర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు శ్రీరామచంద్ర. ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రస్తుతం సింగింగ్ కెరీర్‌లో బిజీగా ఉన్నాడు శ్రీరామచంద్ర. మరి శ్రీరామచంద్రకు ఎదురైన అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
15 Memebers Including me missed our Flight to Goa 12.45pm today from Hyd, Reason the PV.Narsimharao Airport flyover was manually closed for General Public as there was a Ploitician Travelling to the Airport,Sir @KTR_News @KTRBRS Garu @KTRoffice Garu @TSwithKCR Garu,#inconvenience pic.twitter.com/qlabYTdi80
— Sreerama Chandra (@Sreeram_singer) January 30, 2023