ఎవరి జీవితంలోనైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఆనందాన్ని కలిగించేవి, బాధలను గుర్తుచేసేవి రెండూ ఉంటాయి. అలా సాగిపోతున్న లైఫ్ లో జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సందర్భాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. రీసెంట్ గా ప్రముఖ మలయాళ సింగర్ శ్రీకుమార్.. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనతో వర్క్ చేసినప్పటి ఓ పాత ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అవార్డు అందుకున్న కీరవాణికి శుభాకాంక్షలు చెబుతూనే.. ఆ ఫోటో ఎప్పుడు దిగారనే విషయాన్నీ పోస్టులో వివరించారు.
ఇక ఆ ఫోటో ఏ సంవత్సరంలో తీసిందో చెప్పలేదు. కానీ.. మద్రాస్ లోని ఏవీఎం స్టూడియోలో ఓ సినిమా కోసం లైవ్ రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు తీసిందని చెప్పారు. “ఫోటోని గమనించినట్లైతే.. మధ్యలో నిలబడి ఇన్స్ స్ట్రక్షన్స్ ఇస్తున్న వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ రాజమణి, కీబోర్డు ప్లేయర్ గా ఏఆర్ రెహమాన్(ఎడమవైపు), ఎర్రని దోతి కట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ వెనుక అసిస్టెంట్ గా ఉన్నారు ఎంఎం కీరవాణి. ఆయనే ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఆయన్ని అప్పట్లో మరకతమణిగా పిలిచేవారు.. హిందీలో ఎంఎం క్రీమ్ గా పిలుచుకుంటారు. సో.. ఆయన ఇండియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం గర్వకారణం” అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శ్రీకుమార్.
ప్రస్తుతం సింగర్ శ్రీకుమార్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో ఏఆర్ రెహమాన్ తో పాటు ఎంఎం కీరవాణి కలిసి పనిచేశారని విన్నాం. కానీ, ఇద్దరినీ ఒకే పిక్ లో చూడటం ఆనందంగా ఉందని అంటున్నారు సంగీత ప్రియులు. వీరిద్దరూ కూడా ఇండియన్ మ్యూజిక్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టారు. ఇండియాలో బిగ్గెస్ట్ మూవీస్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో దిట్ట. ఎవరి దారులు వారివే.. రెహమాన్ ఆల్రెడీ రెండు ఆస్కార్స్, ఎన్నో గ్లోబల్ అవార్డ్స్ అందుకున్నారు. మరోవైపు కీరవాణి తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం. సో.. ఈ మెమోరబుల్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.