ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. పుట్టిన రోజు దగ్గర నుంచి పెళ్లి రోజు వరకు తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక ప్రస్తుత కాలంలో తమకు కాబోయే వరుడిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం ట్రెండ్ గా మారింది. దాంతో చాలా మంది సెలబ్రిటీలు జీవిత భాగస్వామి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు కాబోయే భర్త ఇతడే అంటూ పరిచయం చేసింది బాహుబలి సింగర్ సత్యయామిని. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
తమకు కాబోయే వాడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేయడం ఇప్పుడున్న ట్రెండ్. ఆ ట్రెండ్ కు తగ్గట్లుగానే సెలబ్రిటీలు తమకు కాబోయే రాకుమారుడి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తనకు కాబోయే జీవిత భాగస్వామి ఇతడే అంటూ భర్తను పరిచయం చేసింది బాహుబలి సింగర్ సత్య యామిని. జక్కన్న తెరకెక్కించిన బాహుబలిలో ‘మమతల తల్లి’ పాటతో మంచి సింగర్ గా గుర్తింపు పొందింది సత్య యామిని. ఈ పాట తర్వాత వరుసగా సత్య యామినికి ఆఫర్లు వచ్చాయి. పాటలు పాడుతూ బిజీ బిజీగా ఉండే యామిని తన జీవిత భాగస్వామిని పరిచయం చేసింది. తన ఇన్ స్టా గ్రామ్ బ్లాగ్ లో తాజాగా ఓ పోస్ట్ ను షేర్ చేసింది.
”జీవితకాలానికి సంబంధించిన రోలర్ కోస్టర్ వేచి ఉంది” అంటూ ఆ పోస్ట్ కు క్యాప్షన్ సైతం రాసుకొచ్చింది. అయితే తన భర్తకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ పోస్ట్ చూసిన తోటి సింగర్స్ తో పాటుగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. సింగర్స్ గీతామాధురి, అనుదీప్, మనిషా, ధనుంజయ్ లతో పాటు చాలా మంది సింగర్స్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ తర్వాత సత్య యామినికి అవకాశాలు వరుసకట్టాయి. కొండపొలం, రాధేశ్యామ్, శైలజారెడ్డి అల్లుడు, అఖండ, బింబిసార లాంటి మరికొన్ని చిత్రాల్లో తన గాత్రంతో అభిమానులను అలరించింది. సత్య యామిని మెుదట్లో ‘పాడుతా తీయగా’, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.