ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఏం చేసినా వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం చూస్తున్నాం. అదీగాక సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇదివరకు సినిమా విషయాలు తప్ప వేరే ఏ విషయాలు బయటికి మాట్లాడేవారు కాదు. కానీ.. కొన్నేళ్లుగా సినిమాలతో పాటు లైఫ్ స్ట్రగుల్స్, పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలలో షేర్ చేసుకుంటున్నారు. ఇదంతా ఓవైపు అనుకుంటే.. మరోవైపు వీడియో వ్లాగ్స్, హోమ్ టూర్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఇప్పటికే ఎంతోమంది సినీ, సీరియల్ సెలబ్రిటీలు వారి ఇళ్లను హోమ్ టూర్ చేసి వీడియోలు రిలీజ్ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ సింగర్ చిన్మయి చేరింది. చిన్మయి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ వస్తోంది. అలాగే నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్యగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కూడా అందరికీ తెలుసు. అయితే.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న తమ ఇంటిని హోమ్ టూర్ చేసింది చిన్మయి. ప్రస్తుతం సింగర్ చిన్మయి హోమ్ టూర్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.