హీరోయిన్ అదితిరావ్ హైదరీ.. సిద్ధార్థ్ తో తన రిలేషన్ పై దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే దాదాపు అదే అనిపిస్తుంది కూడా.
సినీ ఇండస్ట్రీలో రిలేషన్స్, పెళ్లిళ్ల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కలిసి పనిచేస్తున్న టైంలోనే చాలామంది యాక్టర్స్ ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లాంటిది చేస్తుంటారు. ఇది ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్న విషయం. ఈ లిస్టు గురించి చెప్పుకుంటే స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న చిన్న సెలబ్రిటీల వరకు చాలామందే ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో అలా బాగా వినిపిస్తున్న జోడీ సిద్ధార్థ్-అదితీరావ్ హైదర్ జోడీ. ఇప్పుడు వీళ్ల రిలేషన్ పై ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్లు కనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన హీరోగా సిద్ధార్థ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తదితర చిత్రాలతో ఫేమ్ దక్కించుకున్నాడు. సినిమాల పరంగా పక్కనబెడితే హీరోయిన్లతో రిలేషన్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటాడు. మేఘన అనే అమ్మాయిని 2003లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ 2007లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత హీరోయిన్స్ సోహా అలీఖాన్, శృతిహాసన్, సమంత, దీప సన్నిధితో తదితరులతో సిద్ధార్థ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
సిద్ధార్థ్ ప్రేమ వ్యవహారాలు, జనాలకు గుర్తున్నాయో లేదో తెలియదు గానీ ప్రస్తుతం హీరోయిన్ అదితీరావ్ హైదరీతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైంలో చాలాసార్లు ఈ జంట ముంబయిలో కలిసి కూడా కనిపించింది. అయితే దీనిపై అటు సిద్దార్థ్ గానీ, ఇటు అదితి గానీ అస్సలు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు మాత్రం అదితిరావ్.. తన ఇన్ స్టాలో సిద్ధార్థ్ చేసిన ఓ రీల్ ని పోస్ట్ చేసింది. అయితే సిద్ధార్థ్ తో రిలేషన్ లో ఉందనే రూమర్స్ నేపథ్యంలో ఫస్ట్ టైం అతడితో తీసుకున్న వీడియోని అదితి పోస్ట్ చేసింది. ఇందులో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం చూస్తుంటే… చాన్నాళ్ల నుంచి కలిసి ఒకే ఇంట్లోనూ ఉంటున్నారా అనిపిస్తుంది. మరి సిద్దార్థ్-అదితి వీడియోపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.