సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ.. సౌత్ డెబ్యూ మూవీనే డార్లింగ్ ప్రభాస్ తో చేసేసరికి అమ్మడికి ఫ్యాన్ క్రేజ్ అమాంతం పెరిగింది. సాహో ముందు వరకు తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా గురించి పెద్దగా తెలియదు. కానీ అడపాదడపా టీవీ యాడ్స్ లో చూసేవారు. అయితే.. శ్రద్ధా ఆల్రెడీ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది కాబట్టి సోషల్ మీడియాలో కూడా మిలియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక హీరోయిన్స్ అన్నాక వాళ్ళ ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. వాళ్లకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అదేవిధంగా శ్రద్ధా కూడా సోషల్ మీడియా వాడకంలో ముందే ఉంటుంది. అయితే.. ఈ బ్యూటీ గత కొంతకాలంగా అటు సినిమాలకు, ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. శ్రద్ధా నుండి చివరి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రస్తుతం శ్రద్ధా చేతిలో ‘లవ్ రంజన్’ మూవీ ఒక్కటే ఉంది.
ఇదిలా ఉండగా.. శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో తాజాగా తన గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేసింది. అభిమాన హీరోయిన్ అందాలు బయటపెడుతూ కొత్త ఫోటోలు పెట్టేసరికి ఫ్యాన్ ఊరుకుంటారా.. శ్రద్ధా అందాలను అందంగా పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో శ్రద్ధా.. వర్కౌట్ వేర్ లో కనిపించడం విశేషం. చాలా రోజుల తర్వాత శ్రద్ధా అందాలకు ఫిదా అవుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి సాహో బ్యూటీ సరికొత్త ఫోటోషూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.