ఇండస్ట్రీలో హీరోయిన్లు మేమున్నామని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు హాట్ హాట్ గా ఫోటోలు దిగుతా ఉంటారు. వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసి మేము ఇంకా అందంగా ఉన్నామన్న సంకేతాలు ఇండస్ట్రీకి పంపిస్తా ఉంటారు. ఏ డైరెక్టర్ కళ్ళలో అయినా పడకుండా ఉంటామా? సినిమా అవకాశం రాకుండా ఉంటుందా? అని కొంతమంది హీరోయిన్లు హాట్ గా ఫోటోషూట్ లు దిగుతుంటారు. తాజాగా జీవిత రాజశేఖర్ ల గారాల తనయ ‘శివాత్మిక రాజశేఖర్’ ఒక ఫోటోషూట్ దిగారు. దొరసాని చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈమె సోషల్ మీడియాలో అందరి అటెన్షన్ డ్రా చేసే పనిలో బిజీగా ఉన్నారు.
అప్పుడప్పుడూ చీరలో పద్ధతిగా కనిపిస్తూ.. మధ్య మధ్యలో కొంచెం గ్లామర్ డోస్ పెంచి కుర్రకారుకి ఊపిరి సలపనివ్వకుండా చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఒక ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోల్లో ఆమె బిగుతైన నలుపు రంగు దుస్తులు ధరించి మైండ్ బ్లాక్ చేసి పడేశారు. ఆ నల్లని కురులని వీపు మీదకి వదిలేసి బ్యాక్ లెస్ వేర్ తో మత్తెక్కిస్తున్నారు. మెడకి ఒక ఆభరణం ధరించి అప్సరసలా దిగిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మనసు పారేసుకుంటున్నారు. చంపేశావ్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మత్తెక్కించే అందాలతో కనువిందు చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ ఫోటోలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలోనే ఎమోజీ రూపంలోనే వ్యక్తపరచండి.