సమంత ప్రధాన పాత్రలో, దేవ్ మోహన్ హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇక తాజాగా శాకుంతలం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆవివరాలు..
గుణశేఖర్ చిత్రాలు అంటే అందరికి గుర్తుకు వచ్చేది భారీ సెట్‌లు, గ్రాఫిక్స్.. విజువల్ ఫీస్ట్ ఇలా వర్ణిస్తారు. రుద్రమదేవి చిత్రం తర్వాత గుణ శేఖర్ నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత.. సమంత ప్రధాన పాత్రలో.. భారీ బడ్జెట్‌తో.. శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గుణశేఖర్. మహకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సమంత ప్రధాన పాత్రలో, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించన మేర రాణించలేదు. ఒక్క అల్లు అర్హ యాక్టింగ్ మాత్రమే జనాలకు నచ్చింది. అభిజ్ఞాన శాకుంతలం అనేది ప్రేమ కథా చిత్రం. కానీ తెర మీద దాన్ని చూపించడంలో దర్శకుడు గుణ శేఖర్ దారుణంగా విఫలమయ్యాడు.
సాగతీత సన్నివేశాలు, నాసిరకం గ్రాఫిక్స్, అర్థం కాని మాటలు, పాటలతో సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక.. అన్ని భాషల సినిమాలు.. అది కూడా నచ్చిన సమయంలో చూసుకునే వీలు చిక్కడంతో.. ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం మానేశారు. టాక్ బాగున్న సినిమాలనే థియేటర్‌లో చూస్తున్నారు. లేదంటే ఓటీటీలోకి వచ్చాక తీరిగ్గా వీక్షిస్తున్నారు. దాంతో ప్రతి సినిమా థియేటర్ తర్వాత ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది.
ఇక తాజాగా విడుదలైన శాకుంతంల కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏ ఓటీటీలోకి వస్తుంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అనే దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. శాకుంతలం.. అమెజాన్ ఓటీటీలో స్ట్రీమ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో శాకుంతలం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటించింది కాబట్టి.. భారీ ధరకే ఓటీటీకి విక్రయించినట్లు తెలుస్తోంది. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని స్పష్టమవుతుంది. కానీ దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరి శాకుంతలం సినిమా మీకు నచ్చిందా, లేదా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.