ఈ మధ్యకాలంలో పండగొచ్చినా పబ్బమొచ్చినా సోషల్ మీడియాలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ కూడా అందులోనే ఉంటున్నారు. పైగా పుట్టుక నుండి చావు వార్తల వరకూ అన్ని ఇందులోనే. సినీ తారలు, సీరియల్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి శుభకార్యమైనా ఫ్రెండ్స్ కంటే ముందు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది కాబట్టి.. చాలామంది సినీ, సీరియల్ సెలబ్రిటీలంతా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి.. వివాహ బంధంలోకి అడుగు పెట్టేస్తున్నారు.
ఇప్పుడు అదే వివాహ బంధంలోకి దిగుతున్నారు తెలుగు సీరియల్ నటులు అమర్ దీప్, తేజస్విని గౌడ. బుల్లితెరపై పాపులర్ అయిన ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్ దీప్.. ‘కేరాఫ్ అనసూయ’ సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ పెళ్లికి రెడీ అయిపోయారు. మూడు నెలల క్రితం ఆగష్టులో ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరిద్దరూ.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. తాజాగా వీరిద్దరూ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా హల్దీ వేడుకలు జరుపుకున్నారు. వీరి హల్దీ సెలబ్రేషన్స్ కి చాలామంది సీరియల్ ఆర్టిస్టులతో పాటు టీవీ యాంకర్స్ సైతం హాజరై సందడి చేశారు.
ఇక ప్రస్తుతం అమర్ దీప్, తేజస్వినిల హల్దీ వేడుకలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. వీరిద్దరూ వేరు వేరు సీరియల్స్ నటిస్తూ ఎలా కలిశారు? ఎక్కడ వీరి లవ్ స్టోరీ మొదలైంది? పెద్దలు కుదిర్చిన పెళ్లా లేక ప్రేమ పెళ్లా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కానీ.. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంటూ సోషల్ మీడియాలో సీరియల్స్ యూజర్స్, ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కాబోయే కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించనున్న అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడల జంటపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.