చిత్ర పరిశ్రమలో కెరీర్ పరంగా ఎదుర్కొన్న చేదు అనుభవాలైనా, పొందిన హ్యాపీ మూమెంట్స్ అయినా ఏదొక సమయంలో బయట పెట్టేస్తుంటారు సెలబ్రిటీలు. అలా సినీ కెరీర్ లో డైరెక్టర్ గా సూపర్ హిట్స్ తీసిన సీనియర్ డైరెక్టర్ సాగర్.. ఈయన పూర్తిపేరు విద్యాసాగర్ రెడ్డి. తెలుగులో డైరెక్టర్ గా ముప్పైకి పైగా ఆయన సినిమాలు తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అలాగే నిర్మాతగా కూడా పలు సినిమాలు చేసినట్లు తెలిపారు. అయితే.. తాను దర్శకుడిగా ఫామ్ లో ఉన్నప్పుడు దివంగత స్టార్ కమెడియన్ ఎంఎస్ నారాయణతో జరిగిన ఓ సంఘటనను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కెరీర్ లో ఖైదీ బ్రదర్స్, అమ్మదొంగ, రామసక్కనోడు, స్టూవర్టుపురం దొంగలు, రాకాసి లోయ లాంటి విభిన్నమైన సినిమాలు రూపొందించారు డైరెక్టర్ సాగర్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఎంఎస్ నారాయణ ఓసారి ఎక్కువ వాగాడు. అప్పుడు అందరం ప్రశాంత్ కుటీర్ లో ఉండేవాళ్ళం. ప్రొడ్యూసర్ ఎంఎస్ నారాయణకి ఓ పదివేలు ఇవ్వాలి.. నైట్ వచ్చి ఇచ్చేస్తానని అన్నాడు. ఆ రోజు నైట్ ఎంఎస్ నారాయణ ఊరికి వెళ్లాలని వెయిట్ చేస్తున్నాడు. నైట్ మందేసి తినేటప్పుడు.. ‘ఈ లం* కొడుకులు ప్రొడ్యూసర్స్ ఇలాగే చెబుతారండి’ అని ఎంఎస్ నారాయణ ఠక్కున అన్నాడు. ఫాట్ మని ఒకటి కొట్టాను.. అలా ఉండిపోయాడు.
ప్రొడ్యూసర్ ని అలా లం* కొడుకులని ఎందుకు అన్నావ్? తప్పు కదా అని అన్నాను. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రొడ్యూసర్ మనిషి వచ్చి ఎంఎస్ నారాయణకు పదివేలు ఇచ్చి వెళ్ళాడు. నువ్వు అన్న ఆ మాటను రిటర్న్ తీసుకోగలవా? అని అడిగాను.” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ సాగర్. ప్రస్తుతం ఎంఎస్ నారాయణ గురించి డైరెక్టర్ సాగర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసినవారంతా అవునా.. అని ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా వెలిగిన వివి వినాయక్, శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్స్ అంతా సాగర్ దగ్గర అసిస్టెంట్స్ గా చేసినవారే కావడం విశేషం.