సోషల్ మీడియా వినయోగం పెరిగాక సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు చాలా త్వరగా అభిమానులకు చేరుతున్నాయి. అదే సమయంలో వారిని విమర్శించడం కూడా అదే రేంజ్లో జరుగుతుంది. తాజాగా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సీనియర్ నటి యమున స్పందించారు. ఆ వివరాలు..
నటి యమున గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగమ్మాయిగా హీరోయిన్గా ఈ రంగంలోకి వచ్చారు. తొలి సినిమానే విఖ్యాత దర్శకుడు బాలచందర్ డైరెక్షన్లో చేశారు. స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. ఆమె నటించిన విధి, అన్వేషిత సీరియల్స్ ఎంత పాపులారటీ సాధించాయో ప్రత్యేకంగా తెలపాల్సిన పని లేదు. హీరోయిన్లు సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి యమున దారి చూపారు అనడంలో ఎలాంటి అతశయోక్తి లేదు. ఇప్పటికి కూడా ఆమె సీరియల్స్‌లో నటిస్తూ.. బుల్లితెర మీద రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా యమున సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాల్లోకి ఎంట్రీ, ఇండస్ట్రీలో ఆమె సాధించుకున్న క్రేజ్, ఆ తరువాత చోటు చేసుకున్న సంఘటనల గురించి చెప్పుకొచ్చారు యుమున. తన జీవితంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన గురించి నేటికి కూడా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతుందడటం చూసి.. ఆవేదనకు గురయ్యారు. దీని గురించి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వెల్లడించారు యమున. ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతుంది. ఆ వివరాలు..
తన అందం, అభినయంతో ఏళ్ల పాటు టాలీవుడ్‌ని ఏలారు యమున. తన అందం, అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. మంచి నటిగా, వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న యమున మీద 2011లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. బెంగుళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ.. పోలీసులకు పట్టుబడింది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతంది. కానీ ఈ విషయంలో ‘తన తప్పేమీ లేదని, కావాలనే ఆ వివాదంలో తనని ఇరికించారని’ ఈమె ఇప్పటికే అనేక ఇంటర్వ్యూల్లో, పలు వేదికల మీద చెప్పుకొచ్చింది. అయినా సరే నేటి కూడా ఈ విషయంలో యమున మీద ఎన్నో అసభ్యకరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి చూసి తట్టుకోలేక ఓ వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బాధను వ్యక్తం చేసింది యమున.
ఈ వీడియోలో యమున మాట్లాడుతూ.. “హాయ్ అండి.. నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా తెలీని ఓ బాధ అయితే నన్ను వెంటాడుతూనే ఉంది. అది కూడా సోషల్ మీడియా వల్ల. ఎందుకంటే నేను ఏళ్ల క్రితమే ఓ ప్రాబ్లమ్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఆ ప్రాబ్లమ్‌లో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది. న్యాయ పరంగా నేను విజయం సాధించాను..! కానీ సోషల్ మీడియానే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను’’ అన్నారు.
‘‘ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల థంబ్‌నెయిల్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. నేను వాటికి సంబంధించిన వీడియోలను చూడను. వాటిల్లో ఏం ఉందో నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆ థంబ్‌నెయిల్స్ మాత్రం నన్ను చాలా బాధపెడుతున్నాయి. ఈ విషయంలో నన్ను ఎంత నేను మోటివేట్ చేసుకున్నా.. కొన్ని సందర్భాల్లో బాధపడుతుంటాను. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా. ఏదో తెలీని బాధ కలుగుతుంది. ఆ థంబ్‌నెయిల్స్ చూస్తే.. నేను చనిపోయినా కూడా నన్ను వీళ్ళు వదలరు అనిపిస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు యమున. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. పనికి మాలిన వాళ్లు చేసే పనికి మీరు ఎందుకు బాధపడతారు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి యమున చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
