Satya Sri: బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమంది టాలెంట్ ఉన్న సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలుగా మార్చింది జబర్దస్త్. దాదాపు ఎనిమిదేళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. అయితే.. మొదట్లో కంటే ఇప్పుడు ఈ షోలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
జబర్దస్త్ అంటేనే ఎక్కువగా భార్యభర్తల మధ్య, ఇద్దరు లవర్స్ మధ్య జరిగే ఫన్నీ స్కిట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఇదివరకంటే మగవాళ్లే లేడీ గెటప్స్ వేసేవారు. కానీ.. రానురాను స్కిట్స్ లో అమ్మాయిలే కనిపించడం మొదలైంది. ప్రస్తుతం జబర్దస్త్ కి లేడీ గెటప్స్ వేసే వారి అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. నేరుగా లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా లేడీ కమెడియన్స్ లో మొదటగా ఎంట్రీ ఇచ్చినవారిలో సత్య శ్రీ ఒకరు.
జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర ఎక్కువగా ఫ్యామిలీ స్కిట్లను చేస్తుంటాడు. బుల్లితెర నటి అయిన సత్యశ్రీని చంద్రనే జబర్దస్త్ కి పరిచయం చేశాడు. వెండితెరపై పలు సినిమాలలో నటించిన సత్యశ్రీ.. బయట ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటినుండి తనేంటో నిరూపించుకుంటూ వస్తోంది. అలాగే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.
జబర్దస్త్ లో తొలి లేడీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సత్యశ్రీ.. చమ్మక్ చంద్రతో పాటు జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంతోమంది లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బుల్లితెర నటులు రోహిణి, వర్ష, పవిత్ర లాంటివారు కామెడీతో ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా సత్యశ్రీ తాను ఎందుకు జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిందో సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఇంటర్వ్యూలో తన కెరీర్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, చదువు ఇలా అన్ని విషయాలను షేర్ చేసుకున్న సత్యశ్రీ.. జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి కారణం బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ.. జబర్దస్త్ లో నేను చమ్మక్ చంద్ర గారిని గురువుగా భావిస్తాను. ఆయన జబర్దస్త్ ని నుండి వెళ్లిపోవడంతో.. నాతో పాటు మా టీమ్ కూడా గురువు గారి వెంటే ఉండాలనే ఉద్దేశంతో బయటికి వచ్చేశాం. మా గురువు గారితో పాటే మేము అనుకున్నాం.. వచ్చేశాం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సత్యశ్రీ ఫుల్ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతుంది. మరి సత్యశ్రీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.