ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఆమె శరీరంలో ఆ పార్ట్ బాలేదని, సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు. ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ లో కూడా ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకో అంటూ సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా బయట పెట్టింది.
హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే కొన్ని సార్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెండితెర మీద అందంగా కనిపిస్తున్న హీరోయిన్స్ కి కూడా వంకలు పెట్టేవారు ఉంటారు. నీ ముఖం బాలేదని ఒకరు, నీ శరీరంలో ఆ భాగం బాలేదని ఒకరు ఇలా అందం గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో కొంతమంది సర్జరీ చేయించుకుంటారు. కొంతమంది మాత్రం అందం కాదు అభినయం ముఖ్యం అని చెప్పి కాన్ఫిడెన్స్ తో ముందుకు పోతుంటారు. అలాంటి వారిలో సన్యా మల్హోత్రా ఒకరు. ఈమె దంగల్, శకుంతల దేవి, లవ్ హాస్టల్, హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాల్లో నటించింది. హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేశారు.
సన్యా మల్హోత్రా నటించిన ‘కథల్’ సినిమా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ప్రస్తుతం సన్యా మల్హోత్రా పేరు బాలీవుడ్ లో మారుమోగుతోంది. కథల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. దంగల్ సినిమా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి తన రూపురేఖలు బాగాలేదని, దవడకు శస్త్రచికిత్స చేయించుకోమని సలహా ఇచ్చాడని ఆమె గుర్తు చేసుకుంది. అయితే తాను తన అందం పట్ల సంతోషంగానే ఉన్నానని, నా దవడను చూసి అవకాశాలు ఇవ్వడం లేదని.. ఈ దవడ వల్ల అవకాశాలు పోలేదని, సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదని బదులిచ్చారని వెల్లడించింది.
ఆడిషన్స్ కోసం ముంబై వెళ్ళినప్పుడు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నట్లు ఆమె గుర్తు చేసుకుంది. కానీ ఆమె వారి మాటలను పట్టించుకోకుండా కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్, ఫాతిమా సనాలతో పాటు కలిసి నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటిస్తున్నారు. మరి మనిషికి అందం కంటే ప్రతిభ ముఖ్యమని చెప్పిన సన్యా మల్హోత్రాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.