సినిమా షూటింగ్స్ లో నటీ, నటులకు తరుచూ గాయాలు కావడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆ ప్రమాదాలు ప్రాణాలు పోయే స్థాయిలో కూడా జరుగుతుంటాయి.
ఒక సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెరపై కనిపించాలంటే దాని వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. షూటింగ్ సమయంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు షూటింగ్ సమయంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేసే నటులు ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డబుల్ ఇస్మార్ట్ మూవీ షూటింగ్ లో సెట్ లో సంజయ్ దత్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన సంజయ్ దత్.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ పెంచుకున్నారు. కేజీఎఫ్ 2 లో ఆయన నటనలకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ లో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రం బృందం.. రెండో షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లారు. నేడు ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఒక ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా సంజయ్ కు తలపై గాయం అయ్యిందట. వెంటనే ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు కుట్లు కూడా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తలకు కుట్లు వేయడం వల్ల ఆయన ఒక నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని.. ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపినట్లు చిత్ర బృందం తెలిపింది. షూటింగ్ లో సంజయ్ దత్ కి గాయాలు అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. గతంలో ఆయన క్యాన్సర్ బారిన పడి ఈ మద్యనే కోలుకున్నారు. తమ అభిమాన నటుడు సంజయ్ దత్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.