టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కథకు సబంధించి చిన్న లీక్ ఇచ్చాడు డైరెక్టర్. కథ ఏబ్యాక్ డ్రాప్ లో ఉంటుందో చెప్పుకొచ్చాడు.
ప్రజెంట్ టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగానే కథలను, డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నప్పటికీ.. అందరికంటే ముందుగా ఆ రేంజ్ ను అందుకుంది మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని అనౌన్స్ చేశాడు ప్రభాస్. తాజాగా ఆ సినిమా కథను లీక్ చేశాడు సందీప్ రెడ్డి.
రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ గా అభిమానుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇక తన 25వ చిత్రంగా స్పిరిట్ సినిమాని అనౌన్స్ చేశాడు రెబల్ స్టార్. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాను 8 భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ స్పిరిట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీకి సంబంధించి కథను లీక్ చేసి అప్డేట్ ఇచ్చాడు. కథ ఏ జానర్ లో సాగుతుందో కొద్దిగా లీక్ ఇచ్చాడు. స్పిరిట్ మూవీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరగబోతోంది అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈనేపథ్యంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమా గురించి ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ అందించాడు.”నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ తో రా అండ్ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చేయాలని ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు స్పిరిట్ స్టోరీని పవర్ ఫుల్ స్టోరీనే రాస్తున్నా. ఇది కచ్చితంగా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్యాన్స్ మా కాంబినేషన్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉంటుంది” అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.