ప్రముఖ కన్నడ నటుడు నవీన్ కృష్ణ ఇంట ఊహించని సంఘటన చోటుచేసుకుంది. నవీన్ కృష్ణ సోదరి నీతా పవార్ గత మూడు రోజుల నుండి కనిపించకుండా పోయింది. దీంతో నవీన్ కృష్ణ.. తన సోదరి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించగలరని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశాడు. ప్రముఖ కన్నడ నటుడు శ్రీనివాస్ మూర్తి తనయుడిగా నవీన్ కృష్ణ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. కెరీర్ లో సినిమాలతో పాటు టీవీ షోస్ కి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక సోదరి నీతా పవార్ మిస్సింగ్ కేసును సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినట్లు తెలుస్తోంది.
మూడు రోజులుగా స్థానిక పోలీసులతో పాటు నవీన్ కృష్ణ కుటుంబ సభ్యులు నీతా కోసం వెతుకున్నారు. ఈ క్రమంలో నీతా అసలు ఎలా మిస్ అయ్యింది? అనే సందేహాలు వార్త తెలిసిన అందరిలో కలుగుతున్నాయి. కన్నడ సినీవర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. సుబ్రమణ్యపుర పరిధిలో నివాసం ఉంటున్న నీతా పవార్.. జనవరి 17 నుండి కనిపించకుండా పోయింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళొస్తానని వెళ్లి.. ఇంతవరకు తిరిగి రాలేదట. దీంతో వెంటనే విషయం తెలుసుకున్న సోదరుడు నవీన్ కృష్ణ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూప్రక్కల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఇదిలా ఉండగా.. తమ సోదరి నీతా ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని కోరుతూ.. నటుడు నవీన్ కృష్ణ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అలాగే సోదరి నీతా గురించి తెలిసినవారు ఏ ఏరియాలో ఉందో తమకు తెలియజేయాలని కొన్ని ఫోన్ నెంబర్స్ మెన్షన్ చేశారు. అనంత్ 6364830333, అరుణ్- 9886624340, శ్వేత 8861526185, సునీల్ 9886525251 ఈ నెంబర్స్ ని సంప్రదించాలని నవీన్ కృష్ణ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన నవీన్ కృష్ణ.. కదంబ, అమృతవాణి, దిమాక్, శ్రీహరికథ లాంటి పలు హిట్ సినిమాలలో నటించారు. త్వరలోనే ‘భూమికే బండ భగవంత్’ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.