సినీ ఇండస్ట్రీలో అతి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే ఎలాంటి గ్లామర్ షో చేయకుండా తమకంటూ ఓ ప్రత్యేక స్థానం పొందుతారు. కేవలం తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నటి సాయిపల్లవి. చేసిన సినిమాలు తక్కువే అయినా స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటే.. సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అనే స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది తాము డాక్టర్ కావాల్సిన వాళ్లం.. యాక్టర్ అయ్యామని అంటుంటారు. వాస్తవానికి సాయిపల్లవి కూడా డాక్టర్ కావాల్సింది.. కానీ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలో ఎంతో స్టార్ డమ్ తెచ్చుకున్న సాయిపల్లవి సినీ ఇండ్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందని.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ ఏడాది సాయిపల్లవి.. విరాటపర్వం, గార్గీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ రెండు చిత్రాలు ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయాయి. కాకపోతే ఈ రెండు చిత్రాల్లో సాయిపల్లవి నటనకు ఆడియన్స్ నుంచి ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి. అయితే సాయిపల్లవి గార్గి చిత్రం తర్వాత ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీ టాక్. స్టార్ హీరోల సరసన ఛాన్సులు వచ్చినప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు టాక్. దీంతో సాయిపల్లవి ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినపుడు ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో కొద్దిరోజులు వార్తలు సర్దుమణిగాయి.. కానీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
సాయిపల్లవి నటికాక ముందు డాక్టర్.. జార్జియాలో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. భారత్ కి వచ్చిన తర్వాత డ్యాన్స్, యాక్టింగ్ పై మక్కువతో నటిగా మారింది. మాలీవుడ్ లో ప్రేమమ్ చిత్రంతో మంచి విజయం అందుకున్న సాయిపల్లవికి వరుసగా తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో చాన్సులు వచ్చాయి. తెలుగు లో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’తో అందరి మనసు ఫిదా చేసింది. కట్టు, బొట్టు విషయాలో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించే సాయిపల్లవి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే నటిగా ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నా తాను చదివిన చదువుకు న్యాయం చేయాలనే ఆలోచనలో ఉందట సాయిపల్లవి.
డాక్టర్ గా తన సేవలు పదిమందికి పంచాలనే ఉద్దేశంతో కోయంబత్తూర్ లో సొంతంగా ఓ పెద్ద హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు సహాయంతో తన సోదరి పూజా కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంతోనే సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మీడియాలో వస్తున్న ఈ వార్తలు ఎంత వరకు నిజమో సాయిపల్లవి క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.