సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'SSMB28'పై రోజురోజుకూ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇదివరకే అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాలు వచ్చినప్పటికీ.. అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి. కానీ.. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మూడో సినిమా చేస్తుండటంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘SSMB28’పై రోజురోజుకూ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇదివరకే అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాలు వచ్చినప్పటికీ.. అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి. కానీ.. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మూడో సినిమా చేస్తుండటంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఎందుకంటే.. ప్రెజెంట్ ఇద్దరు కూడా వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. దీంతో ఈసారి పెద్ద హిట్టు కొట్టబోతున్నాం అని మహేష్ ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే మహేష్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం SSMB28 మూవీ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. కాగా.. ఈ సినిమాకి సంబంధించి కొత్తగా క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ మహేష్ తో ఈసారి త్రివిక్రమ్.. ఓవైపు యాక్షన్ సినిమా చేస్తున్నాడని అంటుంటే.. మరోవైపు లేదు ఫ్యామిలీ డ్రామా అంటూ టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో సినిమాని సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో అర్జున్ సినిమాని సిస్టర్ సెంటిమెంట్ తో చేశాడు మహేష్.
ఇన్నాళ్లకు ఎస్ఎస్ఎంబి28లో మహేష్ తో సిస్టర్ సెంటిమెంట్ కథాంశాన్ని టచ్ చేయనున్నాడని వినికిడి. అదీగాక మహేష్ కి చెల్లి క్యారెక్టర్ కోసం లేడీ పవర్ స్టార్ సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ.. సాయిపల్లవి కొన్నాళ్లుగా కొత్త సినిమాలేవీ ఓకే చేయట్లేదు. సాయిపల్లవి చివరిగా తెలుగులో విరాటపర్వం చేసింది. ఆ సినిమా తర్వాత ఇంకే సినిమా చేయలేదు. మరి ఇలాంటి తరుణంలో సాయిపల్లవిని త్రివిక్రమ్ సంప్రదించాడా? లేక ఇదంతా రూమర్ యేనా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే.. మరి ఇప్పుడు ఫిమేల్ ఫాలోయింగ్ లో టాప్ హీరో అయిన మహేష్ కి ఓకే చెబుతుందా లేదా చూడాలి. ఇదిలా ఉండగా.. సాయిపల్లవి గతంలో చిరంజీవి సినిమాకి కూడా నో చెప్పారు. మరి మహేష్ కి చెల్లిగా సాయిపల్లవి ఓకే అయితే.. ఆ కాంబో ఎలా ఉండబోతుందో కామెంట్స్ లో తెలపండి.
Unwinding himself to reveal the beast @urstrulyMahesh 🦁#SSMB28 pic.twitter.com/sdcC0Sj2DB
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 2, 2023
❤️🙏🏻 pic.twitter.com/AoFU6ip8pa
— Sai Pallavi (@Sai_Pallavi92) May 9, 2022