తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ మనసు దోచిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మెడిసన్ చేసిన సాయి పల్లవికి మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్నో డ్యాన్స్ షోస్ లో పాల్గొన్న ఈ అమ్మడు మాలీవుడ్ లో ప్రేమమ్ చిత్రంతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇటీవల విరాట పర్వాం, గార్గి అనే సినిమాలతో సాయి పల్లవి తన ఫ్యాన్స్‌ను పలకరించింది. కానీ ఈ రెండు చిత్రాలు పెద్దగా అలరించలేకపోయాయి.
ఇక సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెరపై సాయి పల్లవి డాన్స్ అభిమానించేవారు కోట్లాదిమంది ఉన్నారు. అంతేకాదు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా ప్రజలను మభ్యపెట్టే యాడ్స్ లో తాను నటించబోనని తేల్చి చెప్పింది. అంతేకాదు తనకు నచ్చిన పాత్రల్లో మాత్రమే నటిస్తానని.. ఎలాంటి గ్లామర్ కి చోటు ఇచ్చేది లేదని చెబుతున్నట్లు ఇండ్ట్రీలో టాక్. తనకు సినిమాలు నచ్చితేనే చేస్తాను. లేదంటే క్లినిక్ పెట్టుకొని బతికేస్తానని తన వైద్య వృత్తి గురించి మాట్లాడినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఈ అమ్మడు తన మనసులో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. సాయి పల్లవి పుట్టపర్తి సాయి బాబా ఆలయంలో సందడి చేసింది.
గార్గీ చిత్రం చిత్రం తర్వాత సాయి పల్లవి ఏ సినిమాలు ఒప్పుకోలేదని ఇటీవల సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ అమ్మడు త్వరలో సినిమాలకు పూర్తిగా దూరం అవబోతున్నారని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రతి సంవత్సరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రార్ధనలు జరుపుతుంటారు. ఈ సందర్భంగా సాయి పల్లవి చీరకట్టుతో సాంప్రదాయంగా సాధారణ భక్తురాలిగా దైవ చింతనలో కొత్త సంవత్సరం వేడుకలో పాల్గొంది. సాయి పల్లవిని చూడగానే అభిమానులు ఆమెతో సెల్పీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.