మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా రోజులు తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు. తన 15వ సినిమా సెట్స్ పైకి వచ్చి రెగ్యులర్ షూట్ మొదలైపోయింది. ఈ సినిమాకి ప్రస్తుతం ఎస్‌డీటీ15 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ కథను సుకుమార్ రచించగా.. కార్తిక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. గత వినాయక చవితిరోజు బైక్ ప్రమాదంలో గాయపడిన తర్వాత సాయి తేజ్ సెట్స్ పైకి రావడం ఇదో తొలిసారి. సాయి తేజ్ కు క్రూ మొత్తం ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.
ఇదీ చదవండి: ఐదో రోజు తగ్గేదేలే.. ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన RRR!
వెల్‌కమ్ బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని పూలు జల్లుతూ సెట్‌లోకి ఆహ్వానించారు. వారి ప్రేమానురాగాలను చూసి సాయి ధరమ్ తేజ్ ఎంతో భావోద్యేగానికి లోనయ్యాడు. అందరికీ అభివాదం చేస్తూ ఏడ్చేశాడు. లాంగ్ గ్యాప్ తర్వాత సాయి తేజ్ షూట్ మొదలు పెట్టడంతో.. వరుణ్ తేజ్ సెట్ కు వచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా ఆర్ నారాయణమూర్తి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా చాలా మంది సినీ ప్రముఖులు సెట్ కుచేరుకుని సాయి ధరమ్ తేజ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ సాయి తేజ్ కృతజ్ఞతలు తెలియజేశాడు.