ఆమె బోల్డ్ హీరోయిన్.. టాలీవుడ్ లో అలాంటి రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతడి బర్త్ డే సందర్భంగా.. తన స్టైల్లో బోల్డ్ గా బర్త్ డే విషెస్ చెప్పింది.
మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ అంటే ఎలా చెప్తారు? రోజా పువ్వు లేదంటే చాక్లెట్ ఇస్తారు. ఇంకా డబ్బులుంటే కాస్ట్ లీ గిఫ్ ఇస్తారు. అది కాదంటే గ్రాండ్ గా పార్టీ చేసుకుంటారు. ఇక బాగానే సంపాదించే హీరోయిన్స్ అయితే అంతకు మించి అనేలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈమె మాత్రం బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. అవి చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఇలా ఎలా అని అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏంటా కథ? తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈమె పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. తొలి సినిమాలోనే బోల్డ్ గా కనిపించి ఆశ్చర్యపరిచిన ఈమె… ఆ తర్వాత కూడా ఆ తరహా పాత్రలు కొన్ని కొన్ని చేసింది. వీటితో పాటే డిఫరెంట్ రోల్స్ కూడా చేసింది గానీ హిట్స్ అయితే కొట్టలేకపోయింది. దీంతో ఛాన్సులు దక్కించుకునే రేసులో వెనకబడిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఆదితో ‘కిరాతక’ మూవీ చేస్తున్న పాయల్.. తమిళంలో ‘ఏంజెల్’, ‘గోల్ మాల్’ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.
తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా గురించి చాలారోజుల క్రితమే పాయల్ బయటపెట్టేసింది. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా సౌరభ్ బర్త్ డే సందర్భంగా పాయల్ పెట్టిన ఫొటోస్ షాకయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే మిగతా ఫొటోలన్నీ ఓకే గానీ… ఒకదానిలో మాత్రం పాయల్ టాప్ ఏం వేసుకోకుండా అటువైపు తిరిగి సౌరభ్ తో కలిసి పోజిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలా షాకిచ్చావ్ ఏంటి పాయల్ అని రెచ్చిపోతున్నారు. మరి గత కొన్నాళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న వీళ్లిద్దరూ.. పెళ్లెప్పుడు చేసుకుంటారనేది చూడాలి? పాయల్ ఫొటోపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.