ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా సినీ జక్కన్న తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న సంగతి విదితమే. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది.
దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన అద్భుత సినీ శిల్పం ఆర్ఆర్ఆర్ మరోసారి తన సత్తాను చాటుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న సంగతి విదితమే. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది. తాజాగా ఈ సినిమా మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది.
ఈ ఏడాదికి గానూ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును బాలీవుడ్ అందాల తార రేఖకు అందజేశారు. ఉత్తమ నటుడిగా బ్రహ్మస్త-1కి గానూ రణబీర్ కపూర్ నిలిచారు. బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన కాంతారాలో నటనకు గానూ రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా అలియాభట్ (గంగూభాయ్ కతియావాడి) నిలిచారు. ఉత్తమ చిత్రం కేటగిరిలో కాశ్మీర్ ఫైల్స్ నిలిచింది. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా వరుణ్ థావన్ నిలిచారు. సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉండటంతో రణబీర్ కపూర్ ఆయన ఈ వేడుకలకు హాజరు కాలేదు. రణబీర్ భార్య అలియా భట్ ఆ అవార్డును కూడా స్వీకరించారు. ముంబయిలో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు పాల్గొని సందడి చేశారు. అందాల తారలు.. రెడ్ కార్పెట్ పై హోయలు ఒలికించారు.
ఈ కార్యక్రమానికి వరుణ్ థావన్, ఇషా కొపికర్, విద్యా బాలన్, శ్రియా శరణ్, అనుపమ్ ఖేర్, రోనిత్ రాయ్, శ్రేయా తల్పాడే, అలియా భట్, రేఖ, రిషబ్ శెట్టి, వివేక్ అగ్నిహోత్రి, ఆర్ బాల్కి, తేజశ్వి ప్రకాష్, ఆయుష్ మెహ్ర, నటాలియా, షాహిల్ ఖాన్, పరంపర, హరిహరన్, ఉదిత్ నారాయణన్ తదితరులు రెడ్ కార్పెట్ పై మెరిశారు. అయితే ఈ సినిమా తాజాగా మరో రెండు విదేశీ అవార్డులనూ కొల్లగొట్టింది. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఆర్ఆర్ఆర్ ఇన్ని అవార్డులు సొంతం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.