RRR మూవీకి 'ఆస్కార్' రావడంతో బాలీవుడ్ లో కొందరు తట్టుకోలేకపోతున్నారు. పలు పోస్టుల కింద షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అలానే చేసిన ఓ సెలబ్రిటీని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం ఏమో గానీ ప్రతిఒక్కరూ ఆ మాయలో పడి ఊగిపోతున్నారు. మన సినిమా, మన పాట.. ఆస్కార్ అవార్డు వచ్చిందని గర్వంగా చెప్పుకొంటున్నారు. ఇదే టైంలో కొందరు మాత్రం తమ ఈర్ష్యని బయటపెడుతున్నారు. తెలుగు సినిమాకు ఈ రేంజులో క్రేజ్ దక్కడం చూసి భరించలేకపోతున్నారు. అందులో భాగంగానే చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలా చేసినప్పుడు నెటిజన్స్ ఊరుకుంటారా? అస్సలు సహించరు. ఏకిపారేయడం గ్యారంటీ. తాజాగా ఓ బాలీవుడ్ సెలబ్రిటీ విషయంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజైంది. తెలుగువాళ్లని ఎంతగానే ఆకట్టుకున్న ఈ మూవీ.. హాలీవుడ్ ప్రేక్షకుల్ని మాత్రమే సెలబ్రిటీలను సైతం మెప్పించింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్.. రాజమౌళి సినిమాని తెగ మెచ్చుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఎంతో కష్టపడి తమ సినిమాలోని పాటకు ఆస్కార్ సాధించింది. ఈ క్రమంలోనే కొందరు సాధారణ నెటిజన్స్ మాత్రం డబ్బులిచ్చి కొనుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లని ఎవరూ పెద్దగా పట్టించుకోరు గానీ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్రెండ్ అయిన షాన్ మట్టతిన్ మాత్రం ఓ పోస్ట్ కింద షాకింగ్ కామెంట్ పెట్టాడు.
‘HaHaHa ఇది చాలా ఫన్నీ. ఇప్పటివరకు ఇండియాలో మాత్రమే అవార్డ్స్ కొనుక్కోవచ్చని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆస్కార్స్ లో కూడా అలానే. డబ్బులుంటే ఆస్కార్ కూడా కొనేయొచ్చు Lol’ అని షాన్ కామెంట్ చేశాడు. దీనిపై రెచ్చిపోతున్న నెటిజన్స్.. ముందు మీరు యాక్టింగ్ నేర్చుకోండి, ఆ తర్వాత అవార్డుల గురించి ఆలోచిస్తారులే అని రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ లో మాత్రమే అవార్డ్స్ డబ్బులిచ్చి కొంటారని కూడా పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం.. అందరూ ‘ఆర్ఆర్ఆర్’ గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే.. ఇతడు మాత్రం కోరి కామెంట్ పెట్టి కష్టాల్ని కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది.